VENGAMAMBA JAYANTHI FETE ON APRIL 28_ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతికి ఏర్పాట్లు పూర్తి

Tirumala, 27 April 2018: The 288th Jayanthi fete of Matrusri Tarigonda Vengamamba will be observed on April 28.

There will be Pushpanjali at Vengamamba Brindavan on Saturday evening by 4.30pm. The unjal seva will be performed to processional deities of Lord Malayappa Swamy and His consorts Sridevi and Bhudevi at Narayanagiri Gardens by 6.30pm. The artistes will perform Tarigonda Vengamamba penned Sankeertans on this occasion.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతికి ఏర్పాట్లు పూర్తి

ఏప్రిల్‌ 27, తిరుమల 2018: శ్రీవేంకటేశ్వరస్వామికి అపరభక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవం ఏప్రిల్‌ 28వ తేదీ శనివారంనాడు తిరుమలలో ఘనంగా జరుగనుంది.

శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 1730వ సంవత్సరంలో జన్మించారు. శ్రీ రాఘవేంద్రస్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి లాగా తన బృందావనంలోనే 1817లో సజీవ సమాధి చెందారు. తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించినందుకు గుర్తుగా వెంగమాంబ పేరు ముందు మాతృశ్రీ అనే పదం చేరింది. టిటిడి ప్రతి ఏడాదీ వెంగమాంబ జయంతిని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో సాయంత్రం 4.30 గంటలకు పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కూడిన శ్రీమలయప్పస్వామివారు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాల్లోని శ్రీ పద్మావతి పరిణయమండపానికి వేంచేపు చేస్తారు. రాత్రి 7.30 గంటల వరకు అక్కడ వెంగమాంబ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.