PROVIDING QUALITATIVE COMFORTS TO PILGRIMS IS OUR PRIORITY-TTD _ బ్రహ్మూెత్సవాల్లో శోభాయమానంగా 44 విద్యుత్‌ కటౌట్లు :టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డిCE

Tirumala, 30 September 2017: Providing the best quality comforts to multitude of visiting pilgrims is our top priority, asserted TTD Chief Engineer Sri Chandra Sekhar Reddy.

Briefing the media persons on the civil works, filtration of water, electrical illumination etc. during the ongoing annual brahmotsavams at Tirumala along with Superintending Engineer Sri Ramachandra Reddy in Media Centre on Saturday, he said, about one crore litres of filtered water was filled in the Swami Pushkarini for the celestial occasion of Chakrasnanam on October 1.

Adding further he said, 44 devotional electrical illumination themes and 11 mega size LED screens were arranged for the Brahmotsavams which stood as special attraction during the entire event. He said the engineering department took up road widening, ornamental bhajan mandapams at mada streets, separate Queue lines for Chakrsnanam, proper barricading and fencing works, additional parking lots, a brand new Sarva Bhoopala Vahanam for the brahmotsavams.

60% OF LED LIGHTS TO SAVE POWER

This year 60% of illumination was done with LED lights for special illumination, street lights, electrical arches etc. to save power consumption.

EEs Sri T Venkateswarulu, Sri Prasad, DE Electricals Smt Saraswathi were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

బ్రహ్మూెత్సవాల్లో శోభాయమానంగా 44 విద్యుత్‌ కటౌట్లు :టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి

సెప్టెంబర్‌ 30, తిరుమల 2017: శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆకట్టుకునేలా 44 ఎల్‌ఇడి విద్యుద్దీపాల కటౌట్లను ఏర్పాటుచేశామని టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు 60 శాతం ఎల్‌ఇడి దీపాలు, స్ట్రిప్స్‌ను ఏర్పాటుచేశామన్నారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి పుష్కరిణిలో 10 మిలియన్‌ లీటర్ల పరిశుభ్రమైన నీటిని నింపి బ్రహ్మూెత్సవాలకు సిద్ధం చేసినట్టు తెలిపారు. వాహనసేవలు తిలకించేందుకు వచ్చిన భక్తులకు సౌకర్యవంతంగా గ్యాలరీలు, బారీకేడ్లు, నాలుగు మాడ వీధుల్లో భజనమండపాలను ఏర్పాటుచేశామన్నారు. శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో పెయింటింగ్‌, రంగోళిలు, ప్రదర్శనశాల కోసం ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. రూ.2.6 కోట్లతో నూతన సర్వభూపాల వాహనాన్ని సిద్ధం చేశామని, దాత ఇచ్చిన సొమ్ముతో సహస్రనామకాసుల హారాన్ని తయారు చేయించామని వివరించారు. మకరతోరణం, రెండు తిరుచ్చి పీఠాలు, రెండు తండ్లు, ఐదు చిన్న బలిపీఠాలకు బంగారు తాపడం పనులు చేపట్టినట్టు తెలిపారు. నూతన శ్రీవారి సేవాసదన్‌, తిరువేంకటపథం రింగ్‌ రోడ్డు వద్ద అదనంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టామన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, ఎంబిసి, మేదరమిట్ట వద్ద అదనంగా రెండు ఆర్‌ఓ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బ్రహ్మూెత్సవ మహాప్రదర్శన వద్ద ప్రత్యేక లైటింగ్‌ను తీర్చిదిద్దామన్నారు. మాడ వీధుల్లో 19, ఇతర ప్రాంతాల్లో 12 కలిపి మొత్తం 31 డిజిటల్‌ స్క్రీన్లను ఏర్పాటుచేశామన్నారు.

ఈ సమావేశంలో ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డిఇ శ్రీమతి సరస్వతి, ఇఇలు శ్రీ తోట వేంకటేశ్వర్లు, శ్రీ ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.