MATA VAISHNO TEMPLE BOARD TEAM OFFERS PRAYERS _ శ్రీ‌వారి ద‌ర్శించుకున్న శ్రీ మాత వైష్ణోదేవి ఆలయం అధికారులు

TIRUMALA, 10 MAY 2022: Sri Mata Vaishnavo Devi Shrine Board team who are on a two-day study tour offered prayers in Tirumala temple on Tuesday.

Later TTD EO (FAC) Sri AV Dharma Reddy has given them some valuable suggestions on the queue line management, security aspects.

Later the team inspected queue lines, potu, health, medical, reception, Donor Cell, Annaprasadam and other departments and seen the various amenities being provided to the multitude of visiting pilgrims at Tirumala by TTD.

Sri Mata Vaishno Devi Board JEO Dr Sunil Sharma and other temple officials including Sri Viswajit Singh, Sri Dineesh Gupta, Sri Shammi Sharma, Director SVETA Smt Prasanti, co-ordinator Sri Balaji Deekshitulu were also present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI

శ్రీ‌వారి ద‌ర్శించుకున్న శ్రీ మాత వైష్ణోదేవి ఆలయం అధికారులు

తిరుమ‌ల‌, 2022 మే 10: జమ్మూ కాశ్మీర్ లోని శ్రీ మాత వైష్ణోదేవి ఆలయం అధికారులు మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డిని శ్రీ వైష్ణోదేవి ఆలయ అధికారులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు.

టీటీడీ ఈవో నుంచి వైష్ణోదేవి ఆలయ అధికారులు సలహాలు, సూచ‌న‌లు స్వీకరించారు. శ్రీ మాత వైష్ణోదేవి ప్రసాదాన్ని ఈవోకు అందించారు. అనంత‌రం ఈవో శ్రీ వైష్ణోదేవి బృందాన్ని శాలువాతో సత్కరించారు. తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న క్యూలైన్లు, పోటు, హెల్త్ ఆఫీస్, అశ్వని వైద్యశాల, సి.ఆర్.ఓ ఆఫీస్, సన్నిధానం, మాధవం, డోనర్ సెల్, అన్నప్రసాదం వంటి అనేక విభాగాలను అధికారుల బృందం పరిశీలించి, అక్కడి అధికారులనడిగి పాల‌నా ప‌ర‌మైన‌ విషయాలు తెలుసుకున్నారు. అదేవిధంగా భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణోదేవి ఆలయ సంయుక్త ఛీఫ్ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సునీల్ శర్మ, ఆలయ అధికారులు శ్రీ విష్వజిత్ సింగ్, శ్రీ దినిష్ గుప్త, శ్రీ షమి శర్మ, శ్వేత డైరక్టర్ శ్రీ‌మ‌తి ప్రశాంతి, సమన్వయకర్త పివి.బాలాజీ దీక్షితులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.