MATSYA NARAYANA SHINES ON SURYAPRABHA _ సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై మత్స్య నారాయణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

TIRUMALA, 03 SEPTEMBER 2022: In the guise of Sri Matsya Narayana Swamy, the processional deity of Sri Malayappa shined brightly on Suryaprabha Vahanam on the seventh day morning of the ongoing annual Brahmotsavams in Tirumala on Monday.

 

The Sun God is considered to be the Pratyaksha Daivam as He is the key for ecological balance. The chief source of Energy for the entire life cycle. To showcase that He is the Universal Source of Life, lord as Matsya Suryanaryana blessed His devotees.

 

Both the Pontiffs of Tirumala, TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, Board members, other officials, large number of pilgrims were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై మత్స్య నారాయణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

తిరుమల, 2022 అక్టోబరు 03: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం ఉదయం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ మలయప్పస్వామివారు మత్స్య నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

రాత్రి 7 గంటలకు చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు అనుగ్ర‌హిస్తారు.

వాహనసేవలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ మారుతిప్రసాద్, శ్రీ మధుసూదన్ యాదవ్, ఢిల్లీ స్థానికి స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, జెఈవోలు శ్రీమ‌తి స‌దాభార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్‌, ఆలయ డెప్యూటి ఈవో శ్రీ ర‌మేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.