STATE OF ART MODEL MEDICAL LABORATORY SOON IN TIRUPATI-JEO_ టిటిడి ఆధ్వర్యంలో త్వరలో ఆధునిక వైద్యపరీక్షల కేంద్రం : జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirumala, 11 January 2018: Tirupati JEO Sri P Bhaskar said, Tirupati will soon have State of Art advanced medical laboratory.

The JEO conducted a review meeting with all famous labs in SVETA building on Thursday evening.

He said already super specialty medical services are being given people at feasible rates in SVIMS while major ortho operations are being done free of cost in BIRRD. “While we also have Shanker Netralaya, Appollo services, Global and TATA are also in pipeline. As per tge instructions of AP CM Sri Chandrababu Naidu to make Tirupati a medical hub, our EO Sri Anil Kumar Singhal is committed to provide advanced medical facilities to people.

CMO Dr Nageswara Rao, SE I Sri Ramesh Reddy, CAO Sri Raviprasadudu, Lab representatives were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టిటిడి ఆధ్వర్యంలో త్వరలో ఆధునిక వైద్యపరీక్షల కేంద్రం : జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 జనవరి 11: సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా టిటిడి ఆధ్వర్యంలో త్వరలో తిరుపతిలో ఆధునిక వైద్యపరీక్షల కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు, టిటిడి ఉద్యోగులకు నాణ్యంగా వ్యాధి నిర్ధారణ వైద్యపరీక్షలు నిర్వహించాలని ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించినట్టు తెలిపారు. దీనిపై గురువారం తిరుపతిలోని శ్వేత భవనంలో పలు ప్రముఖ ల్యాబ్‌ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇప్పటికే స్విమ్స్‌కు ఆర్థికసాయం అందిస్తున్నామని, తిరుమల, తిరుపతిలో టిటిడి ఆసుపత్రుల ద్వారా భక్తులకు, ఉద్యోగులకు వైద్యం చేస్తున్నామని, ఆర్థోపెడిక్‌ వ్యాధుల నివారణకు బర్డ్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్నామని వివరించారు. అరవింద నేత్ర వైద్యశాల, టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి తరహాలోనే తిరుపతిలో అడ్వాన్స్‌డ్‌ మోడల్‌ మెడికల్‌ లాబొరేటరి సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇక్కడ సాధారణ ధరకు వైద్యపరీక్షలు నిర్వహిస్తారని తెలియజేశారు. సేవాభావంతో వైద్యపరీక్షలు నిర్వహించే పలు ప్రముఖ సంస్థలను ఇందుకోసం ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, సిఏవో శ్రీ రవిప్రసాదు, సిఎంవో డా|| నాగేశ్వర్‌రావు, ఢిల్లీకి చెందిన లాల్‌పత్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌, ముంబయికి చెందిన ఎస్‌ఆర్‌ఎల్‌ లిమిటెడ్‌, చెన్నైకి చెందిన మెడల్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.