TTD PUBLICATIONS WING TO RELEASE 14 SPIRITUAL BOOKS AT A TIME

Tirumala, 1 Oct. 19: As a part of its effort to propagate Hindu Sanatana Dharma, the Publications wing of TTD is all set to release 14 Spiritual books penned by scholars during Hamsa Vahanam as a part of the ongoing annual brahmotsavams on Tuesday.

Explaining the details to media persons in Media Centre at Rambhagicha Rest House 2 in Tirumala on Tuesday morning, the Special Officer of TTD Publications Sri Anjaneyulu said, eminent scholars from Telugu, Tamil and Sanskrit have written books on Vaikhanasa Siddhanta, Tirumala Kshetram, Narayana Mantram etc. 

He said the Publications wing of TTD has published one lakh slokas of Mahabharata in Devanagiri and Telugu with the support of Rashtriya Sanskrit Vidyapeetham in Tirupati. All publications of TTD are uploaded in the website. While some 104 literary works have been sent to noted libraries across the state. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో 14 పుస్త‌కాలు ఆవిష్క‌ర‌ణ : డా. తాళ్లూరు ఆంజనేయులు

అక్టోబరు 01, తిరుమల, 2019:   శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా హంస వాహ‌న‌సేవ‌లో 14 పుస్త‌కాలు ఆవిష్క‌రిస్తామ‌ని టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. తాళ్లూరు ఆంజనేయులు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో మంగ‌ళ‌వారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. తాళ్లూరు ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగు, త‌మిళం, సంస్కృత భాష‌ల్లో  ప్ర‌ముఖ పండితులు ఈ పుస్త‌కాల‌ను ర‌చించార‌ని తెలిపారు. ఇందులో వైకాన‌స సిద్ధాంత‌, తిరుమ‌ల క్షేత్రం, నారాయ‌ణ‌మంత్రం త‌దిత‌ర పుస్త‌కాలున్నాయ‌ని వివ‌రించారు. తిరుప‌తిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం స‌హ‌కారంతో మ‌హాభారతంలోని ల‌క్ష శ్లోకాల‌ను తెలుగు, దేవ‌నాగ‌రి లిపిలో ప్ర‌చురించిన‌ట్టు వెల్ల‌డించారు. టిటిడి ప్ర‌చుర‌ణ‌ల‌న్నింటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశామ‌న్నారు. రాష్ట్రంలోని ప‌లు గ్రంథాల‌యాల‌కు 104 ప్ర‌చుర‌ణ‌ల‌ను ఉచితంగా అంద‌జేశామ‌ని తెలిపారు.

మీడియా స‌మావేశంలో టిటిడి ఏపిఆర్వో కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.