MORE FACILITIES TO VEDIC STUDENTS-TIRUPATI JEO_ టిటిడి వేద పాఠశాలల విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

Tirupati, 26 Jun. 19: The students studying in TTD Veda Pathashalas will be provided with enhanced facilities, said Tirupati JEO Sri B Lakshmikantham.

Reviewing on the Veda Pathashalas management with the concerned officials in his chambers in TTD Administrative building in Tirupati on Wednesday, the JEO said, the amenities and infrastructure facilities need to be increased for the students studying in TTD Veda Pathashalas at Guntur, I-Bhimavaram, Vijayanagaram, Keesaragutta, Chilukuru, Nalgonda.

He also reviewed on teaching and non-teaching faculty, hostel, medical, sanitation wings in the concerned schools with the respective principals.

CE Sri Chandrasekhar Reddy, Higher Vedic Studies AEO Sri C Govindarajan, Principals Sri Srinivasa Sarma, Sri D Venugopal, Sri L Satyanarayanamurthy, Sri CH Shanmuga Sharma, Sri M Venkata Ramasharma were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టిటిడి వేద పాఠశాలల విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

తిరుపతి 2019 జూన్ 26: టిటిడి వేద పాఠశాలల విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తిరుపతి జెఈవోశ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో బుధవారం ఉదయం అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఐ. భీమవరం, విజయనగరం, గుంటూరు జిల్లాలో కోటప్పకొండ, తెలంగాణ రాష్ట్రంలో కీసరగుట్ట, చిలుకూరు, నల్గొండ ప్రాంతాలలో వేద పాఠశాలలను టిటిడి నిర్వహిస్తోందని, ఆయా ప్రాంతాలలోని విద్యార్థులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వేద పాఠశాలలను ఇంజనీరింగ్ అధికారులు సందర్శించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులకు వసతి, తరగతి గదులు, త్రాగునీరు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, సిబ్బందికి వసతి గదులు, ప్రహరీ నిర్మాణం, వంట గదులు, మరుగుదొడ్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వేద పాఠశాలలలోని వివిధ అంశాలపై ఆయా ప్రిన్సిపాల్ లను జెఈవో అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సీఈ శ్రీ సి. చంద్రశేఖర్ రెడ్డి, హయ్యర్ వేదిక్ స్టడీస్ అధికారి శ్రీ చక్రవర్తి గోవిందరాజన్, టిటిడి వేద పాఠశాలల ప్రిన్సిపాల్ లు శ్రీ జి. శ్రీనివాస శర్మ, శ్రీ డి. వేణుగోపాల్, శ్రీ ఎల్. సత్యనారాయణ మూర్తి, శ్రీ సిహెచ్. షణ్ముగశర్మ, శ్రీ ఎం. వెంకటరామశర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.