MORE IMPROVEMENTS IN QUEUE LINES FOR THE SAKE OF PILGRIMS-TTD EO_ భక్తుల సౌకర్యాలను పరిశీలించిన టిటిడి ఈవో, జెఈవో

EO, JEO INSPECTS QUEUE LINES IN TIRUMALA

Tirumala, 16 June 2018: More improvements will be made in the queue lines and permanent toilets will be constructed at different pilgrim centric places, said TTD EO Sri Anil Kumar Singhal.

In the wake of unprecedented week end rush witnessed in Tirumala on Saturday, TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected queue lines at Narayanagiri Gardens.

Later speaking to media persons, the EO said, In spite of the completion of summer vacation and the hill town is currently witnessing heavy week end pilgrim rush. The EO said, about 75% of pilgrims are opting for various formats of time slot darshans while the rest of 25% of pilgrims alone are waiting in queue lines and compartments. Even for them we are contemplating to make some arrangements by improving the queue lines and constructing additional toilets. We have already sanctioned Rs.26cr towards the overall improvement. We are also going to make some changes in the queue lines for the convenience of the pilgrims which will be ready by Vaikuntha Ekadasi”, he added.

CE Sri Chandra Sekhar Reddy, Incharge CVSO Sri Siva Kumar Reddy, SE II Sri Ramachandra Reddy, Health officer Dr Sermista, VGO Sri Ravindra Reddy, SO Annaprasadam Sri Venugopal were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తుల సౌకర్యాలను పరిశీలించిన టిటిడి ఈవో, జెఈవో

జూన్‌ 16, తిరుమల 2018: వేసవి సెలవులు ముగిసినా వారాంతం కావడంతో తిరుమలకు విశేషంగా విచ్చేసిన భక్తులకు కల్పించిన సౌకర్యాలను శనివారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి పరిశీలించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తుల క్యూలైన్లు, అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ వేసవిలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిపి 75 శాతం మంది భక్తులకు నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పించామన్నారు. రానున్న కాలంలో భక్తులకు మరింత సులభతరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రస్తుత ఉన్న వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రూ.26 కోట్లతో తిరుమలలో అవసరమైన ప్రాంతాల్లో అదనంగా మరుగుదొడ్లు ఏర్పాటుచేసి 6 నెలల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ఏకాదశి లోపు క్యూలైన్లలోనూ మార్పులు చేస్తామని చెప్పారు.

ఈ తనిఖీల్లో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.