MORE THAN 24 THOUSAND DEVOTEES PARTICIPATE IN TUMBURU TIRTHA MUKKOTI _ తుంబురు తీర్థ ముక్కోటిలో 24 వేల మందికి పైగా పాల్గొన్న భక్తులు
Tirumala, 25 March 2024: About 24000 devotees participated in Tumburu Theertha Mukkoti this year and took holy bath in torrent waters.
As the Pournami timings lasted both on March 24 and 25, TTD allowed pilgrim devotees to trek the Theerrham on both the days.
On March 24, a total of 15,750 devotees were allowed from 5am to 3pm ehile on March 25, 8,250 devotees were allowed from 5am to 11am.
These devotees performed Tirtha Snanm on the day of Phalguna Poornami.
Arrangements
Upon the instructions of TTD EO Sri AV Dharma Reddy, a large-scale arrangements for the convenience of devotees going to Tumburu Tirtham were made.
As part of this, morning and evening Pongal, upma, milk and buttermilk were provided continuously on both the days.
Similarly, in the afternoon and night Sambar rice, curd rice, tomato rice and pulihora were distributed to the devotees by the Srivari Sevaks.
The engineering department laid necessary sheds, ladders and drinking water taps have been installed in the middle of the path for the devotees.
Those suffering from chronic diseases, asthma, obesity and heart related diseases were not allowed to trek the Tirtham.
Devotees were allowed only in RTC buses due to parking problem at Papa Vinasanam.
The Radio and Broadcasting Department has made frequent announcements on the precautions to be taken by the devotees while going to Tumburu Tirtham through continuous announcements
Under the supervision of the Health Department, extra staff were appointed for sanitation at Tumburu Theertham and Papavinasanam.
Ambulances and paramedical staff were placed to serve the devotees in emergency situations with essential medicines.
On the other hand, TTD security department, police and forest department staff have made elaborate security arrangements.
The devotees expressed immense satisfaction over the food offerings, buttermilk, drinking water and other arrangements provided by TTD.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
తుంబురు తీర్థ ముక్కోటిలో 24 వేల మందికి పైగా పాల్గొన్న భక్తులు
తిరుమల, 2024 మార్చి 25: తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థముక్కోటిలో 24 వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.
మార్చి 24న మొత్తం 15,750 మంది, మార్చి 25న 8,250 మంది భక్తులు ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన తీర్థ స్నానం ఆచరించారు.
టీటీడీ విస్తృత ఏర్పాట్లు
టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తుంబురు తీర్థానికి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మార్చి 24వ తేదీ ఉదయం 5 గంటల నుండి నిరంతరాయంగా ఉదయం, సాయంత్రం పొంగలి, ఉప్మా, పాలు, మజ్జిగ అందించారు. అదేవిధంగా మధ్యాహ్నం, రాత్రి సాంబరు అన్నం, పెరుగన్నం, టమోటఅన్నం, పులిహోరాను భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు.
ఇంజినీంగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గo మధ్యలో నిచ్చెనలు, త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూల కాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్‌కాస్టింగ్ విభాగం ఆధ్వర్యంలో తరచూ ప్రకటనలు చేశారు.
ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం, పాపావినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు అంబులెన్స్‌లను, పారామెడికల్ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు టిటిడి భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
టీటీడీ కల్పించిన అన్నప్రసాదాలు, తాగునీరు, ఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.