FACE LIFT SOON TO SV MUSEUM-EO_ ఎస్వీ మ్యూజియాన్ని మరింత ఎక్కువమంది భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 31 May 2018: The SV Museum in Tirumala should transform it’s look to attract more number of pilgrim visitors, said, TTD EO Sri Anil Kumar Singhal.

Reviewing on SV Museum in his chambers in TTD Administrative Building in Tirupati, the EO said, the at present, around 5000 pilgrims are visiting on an average per day and it should be increased to 20 thousands, by making necessary infrastructure developmets, he opined.

He directed the concerned to develop lighting for museum to make it more attractive, construct toilets and other necessary amenities for the sake of visitors.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, FACAO Sri Balaji, Chief Audit Officer Sri Sesha Sailendra, Chief Museum Officer Dr P V Ranganayakulu and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ మ్యూజియాన్ని మరింత ఎక్కువమంది భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

మే 31, తిరుపతి 2018: తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని మరింత ఎక్కువమంది భక్తులు సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల కార్యాలయంలో ఈవో గురువారం ఎస్వీ మ్యూజియం కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం రోజుకు 5 వేల మంది భక్తులు మ్యూజియాన్ని సందర్శిస్తున్నారని, ఈ సంఖ్యను 20 వేలకు పెంచి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్నమయ్య రాగిరేకులు, వివిధ ఆకృతుల్లో ఉన్న శిల్పాలు, ప్రాచీన చిత్రలేఖనం, ఇతర పురాతన చారిత్రక ప్రాధాన్యం గల కళాకృతులకు వేరువేరు గ్యాలరీలు ఏర్పాటుచేయాలని సూచించారు. గ్యాలరీలకు ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు తాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అవసరమైన మరమ్మతులు పూర్తిచేయాలని, మెటల్‌ డిటెక్టర్‌, ముఖ్యమైన ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఎఫ్‌ఏసిఏవో శ్రీఓ.బాలాజి, చీఫ్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ శ్రీ శేషశైలేంద్ర, మ్యూజియం అధికారి శ్రీ పి.వి.రంగనాయకులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.