MUSICAL TREAT SPREADS DEVOTION IN KAPILATHIRTHAM _ కపిలతీర్థంలో భక్తిభావం పంచిన సంకీర్తనాలాపన
Tirupati, 08 March 2024: The music and dance programs organized by Sri Venkateswara College Music and Dance along with its sister concern Sri Venkateswara Nadaswara and Dolu School on the eighth day of the annual Brahmotsavam of Sri Kapileswara Swamy have enthralled the devotees.
As part of this, on the stage set up in the premises of the temple, the vocal lecturer Sri. Sabarigirish along with his group of students sang many Sankeertans in harmony. They were assisted by Sri Jayaram on violin and Sri Raghuram on mridangam.
Later, Smt. Srivani, head of the Veena department of the college, assisted by Sri Ramesh on the mridangam and Sri Raghuram on the ghatam rendered a soulful concert
After that a Bharatanatyam performance by the alumni of the college Smt. Chaitanya Kusumapriya and Sri Modini Suresh went on with a good performance.
In this program, College Special Officer, CAuO Sri. Seshashailendra, Principal Dr Uma Muddubala, other lecturers, students and devotees participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
కపిలతీర్థంలో భక్తిభావం పంచిన సంకీర్తనాలాపన
తిరుపతి, 2024, మార్చి 08: శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాశాల గాత్ర విభాగం అధ్యాపకులు శ్రీ శబరిగిరీష్ తన శిష్య బృందంతో కలిసి పలు సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. వీరికి వయోలిన్ పై శ్రీ జయరాం, మృదంగంపై శ్రీ రఘురామ్ వాద్య సహకారం అందించారు.
అనంతరం కళాశాల వీణ విభాగాధిపతి శ్రీమతి శ్రీవాణి వాద్యసంగీతం సభను రక్తి కట్టించింది. వీరికి మృదంగంపై శ్రీ రమేష్, ఘటంపై శ్రీ రఘురామ్ వాద్య సహకారం అందించారు. ఆ తరువాత కళాశాల పూర్వ విద్యార్థులు శ్రీమతి చైతన్య కుసుమప్రియ, శ్రీ మోదిని సురేష్ బృందం భరతనాట్య ప్రదర్శన చక్కటి అభినయంతో సాగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రత్యేకాధికారి, సీఏఓ శ్రీ శేషశైలేంద్ర, ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.