TIRUMALA JEO POURS IN LAURELS ON ALL FOR THE SUCCESS OF GARUDA SEVA_ గరుడసేవను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు : జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirumala28,September2017:The successful conduct of Garuda Seva is a joint effort by TTD, vigilance, police, scouts and srivari seva volunteers, lauded Tirumala JEO Sri KS Sreenivasa Raju.
Pouring on laurels on every department who strove hard in the success of mega religious event of Garuda Seva during Sectoral Officers meeting on Thursday evening, the JEO said, both the vigilance and police personel as a team well managed the pilgrim crowd without any untoward incident in spite of unprecedented rush.
“The system was well planned and designed by engineering wing of TTD while the Srivari Seva volunteers have rendered outstanding services to pilgrims”, he added.
CE Sri Chandrasekhar Reddy, SE II Sri Ramachandra Reddy, Temple DyEO Sri Kodanda Rama Rao were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
గరుడసేవను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు : జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
సెప్టెంబర్ 28, తిరుమల 2017: ప్రశాంతంగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించి శ్రీవారి గరుడ వాహనసేవను విజయవంతం చేసేందుకు కృషి చేసిన టిటిడి అధికారులు, సిబ్బంది, పోలీసులు, డెప్యుటేషన్ సిబ్బందికి టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు అభినందనలు తెలియజేశారు. తిరుమలలోని రాంభగీచా విశ్రాంతి గృహం ఎదురుగా గల కంట్రోల్ సెంటర్‌లో గురువారం సాయంత్రం అధికారులతో జెఈవో సమావేశం నిర్వహించారు.
గ్యాలరీల్లోని భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు అందించిన ఆ విభాగం సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. శ్రీవారి సేవకులు భక్తులకు విశేషసేవలు అందించారని కొనియాడారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు టిటిడి ఇంజినీరింగ్, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో వ్యవహరించారని తెలిపారు.
ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.