GIRI PRADAKSHINA FESTIVAL AT NARAYANAVANAM SRI KVS TEMPLE_ నారాయణవనంలో జనవరి 16న గిరిప్రదక్షిణ ఉత్సవం

Tirupati, 14 January 2018: The Giri pradakshina festival is being organised for the Sri Agastheswaraswamy and Sri Parashareswara swamy utasava idols on January 16 at the Sri Kalyana Venkateswara Swamy Temple in Narayanavanam .

The deities will be paraded on mada streets of Narayanavanam and taken to kondachuttu Mandapam at Nagaraj town for special ritual as by local villagers. Later in the day the utsava idols will be brought back to Sri KV temple via Parameswara Mangalam and Battalavari Kandigai.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నారాయణవనంలో జనవరి 16న గిరిప్రదక్షిణ ఉత్సవం

తిరుపతి,2018 జనవరి 14: నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అగస్తీశ్వరస్వామి మరియు శ్రీ పరాశరేశ్వరస్వామివారి ఉత్సవమూర్తుల గిరిప్రదక్షిణ ఉత్సవం(కొండచుట్టు తిరునాళ్ల) జనవరి 16వ తేదీన ఘనంగా జరగనుంది. ఉదయం శ్రీపరాశరేశ్వరస్వామివారు నారాయణవనం పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. అరుణా నది వద్ద శ్రీ అగస్తీశ్వరస్వామివారితో కలిసి ఊరేగింపుగా రాత్రి నగరిలోని కొండచుట్టు మండపం వద్దకు చేరుకుంటారు. నగరి పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వివిధ దేవతామూర్తులను కొండచుట్టు మండపం వద్దకు చేర్చి పూజా నైవేద్య కార్యక్రమాలు, సంధింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అనంతరం శ్రీ అగస్తీశ్వరస్వామివారు, శ్రీ పరాశరేశ్వరస్వామివారు బయలుదేరి మొట్టిగాని సత్రం, పరమేశ్వరమంగళం, బత్తలవారి కండ్రిగ మీదుగా నారాయణవనంలోని ఆయా ఆలయాలకు చేరుకుంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.