SAHASRA KALASABHISHEKAM AT SRI KRT ON JAN 16_ జనవరి 16న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

Tirupati, 14 January 2018: On Tuesday, Amavasya, January 16 Sahasra Kalashabhisekam and Hanumantha vahanam will be grandly performed. Interested devotee couple could participate in Abhisekam with payment of Rs 500 and beget Prasadam of one uttariyam, one blouse, one laddu and vada.

Later in the evening Hanumantha vahanam Seva will be conducted as per Vaikhanada agama tradition of such special rituals on Pournami, Amavasya, Shukla Ekadasi, Krishna Ekadasi, stars of Sravanam and Punarvasu.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జనవరి 16న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

తిరుపతి,2018 జనవరి 14: తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో జనవరి 16వ తేదీ మంగళవారం అమావాస్యనాడు సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

సాయంత్రం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల నడుమ హనుమంత వాహనసేవ జరుగనుంది. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రం తదితర పర్వదినాలకు చాలా విశిష్టత ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.