NRUSIMHA JAYANTHI IN TIRUMALA ON APRIL 28_ ఏప్రిల్‌ 28న శ్రీ నృసింహ జయంతి

Tirumala, 27 April 2018: The annual Narasimha Jayanthi will be observed in Sri Yoga Narasimha Swamy temple inside Tirumala shrine on Saturday.

Special abhishekam will be performed to the presiding deity as per agamas. Sri Vaishnava Saint Sri Ramanujacharya consecrated this idol inside Srivari temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌ 28న శ్రీ నృసింహ జయంతి

ఏప్రిల్‌ 27, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 28వ తేదీ శనివారం నృసింహ జయంతి ఘనంగా జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం చేపడతారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు.

నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ జయంతి అనంతరం ఉభయనాంచారులతో కలిసి శ్రీ మలయప్పస్వామివారు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత శ్రీ యోగ నరసింహస్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు.

శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.