ROOMS FOR EVERYONE DURING BRAHMOTSAVAMS-DEPUTY EO RECEPTION_ బ్రహ్మూెత్సవాల్లో భక్తులకు అందుబాటులోకి రోజుకు దాదాపు 4 వేల గదులు : టిటిడి వసతి కల్పన విభాగం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్
Tirumala, 29 September 2017: There were no backlogs and occupancy ratio is almost 94 percent with transparency in allotment of rooms for devotees at Tirumala during Brahmotsavams in the last seven days so far, said DyEO Reception Wing Sri Haridranath.
Briefing the media at the Media centre on Friday over the arrangements made by reception wing for Brahmotsavams, he said, “In all, 4000 rooms of all categories were kept ready and the advance booking were not entertained even to donors in order to provide rooms to maximum number of pilgrims during annual fete.
He said the reception wing had infused more transparency in room allotment by registering rooms on aadhar basis and alter allotment as and when vacancy was recorded by computers without manual interference.
OSD Sri Lakshminarayan Yadav was also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI
బ్రహ్మూెత్సవాల్లో భక్తులకు అందుబాటులోకి రోజుకు దాదాపు 4 వేల గదులు : టిటిడి వసతి కల్పన విభాగం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్
సెప్టెంబర్ 29, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం రోజుకు దాదాపు 4 వేల గదులు అందుబాటులో ఉన్నాయని టిటిడి వసతి కల్పన విభాగం డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ హరీంద్రనాథ్ మాట్లాడుతూ మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన భక్తులకు గదులు కేటాయిస్తున్నామని తెలిపారు. భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు సిఆర్‌వో వద్ద గల కౌంటర్లలో రిజిస్ట్రేషన్ ద్వారా గదులు మంజూరు చేస్తున్నామని వివరించారు. బ్రహ్మూెత్సవాల విధులకు వచ్చిన సిబ్బందికి, కళాకారులకు పరిమిత సంఖ్యలో గదులు కేటాయించినట్టు తెలిపారు. గదుల ఆక్యుపెన్సీ ఇప్పటివరకు 94 శాతంగా నమోదైందని తెలియజేశారు.
ఈ సమావేశంలో టిటిడి ప్రజసంబంధాల అధికారి డా|| టి.రవి, ఓఎస్‌డి శ్రీ లక్ష్మీనారాయణ యాదవ్, సహాయ ప్రజాసంబంధాల అధికారిణి కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.