PANGUNI UTTARA UTSAVAM HELD IN SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పంగుణోత్తర ఉత్సవం ప్రారంభం
TIRUPATI, 12 MARCH 2022: Panguni Uttara Utsavam was held in the sub-temple of Sri Pundarikavalli Tayar in Sri Govindaraja Swamy temple in Ekantam on Saturday. This fete will conclude on March 17.
In connection with this festival Tirumanjanam will be performed to the presiding deity of Tayar(Salai Nachiyar) on March 14 while on March 18, Garuda Seva will be performed in Ekantam.
In-charge DyEO Smt Kasturi Bai, AEO Sri Ravi Kumar Reddy, Chief Priest Sri Srinivasa Deekshitulu, Superintendent Sri Narayana, Temple Inspector Sri Kamaraju were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పంగుణోత్తర ఉత్సవం ప్రారంభం
తిరుపతి, 2022 మార్చి 12: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గల శ్రీ పుండరీకవళ్లి (సాలైనాంచియార్) అమ్మవారి పంగుణోత్తర ఉత్సవం శనివారం ప్రారంభమైంది. మార్చి 17వ తేదీ వరకు ఏకాంతంగా ఈ ఉత్సవం జరుగనుంది.
ఈ సందర్భంగా సాయంత్రం విశేషసమర్పణ అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారిని ఆలయ విమానప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత శ్రీ గోవిందరాజస్వామివారికి, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారికి ఊంజల్‌సేవ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్ఛార్జి డెప్యూటీ ఈఓ శ్రీమతి కస్తూరిబాయి, ఏఈఓ శ్రీ రవికుమార్ రెడ్డి, ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కామరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.