Particulars of Human hair e-auction held on 31-01-2013 _ తలనీలాల విక్రయం ద్వారా తితిదే ఆదాయం రూ.83.53 కోట్లు

Under the guidance of Tirumala Joint Executive Officer Sri
K.S.Sreenivasa Raju, TTD netted Rs. 83.5 crore over the human hair
sale in e-auction today.

తలనీలాల విక్రయం ద్వారా తితిదే ఆదాయం రూ.83.53 కోట్లు

తిరుపతి, జనవరి 31, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో తితిదే రూ.83.53 కోట్ల ఆదాయాన్ని సాధించింది.
తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు గురువారం నాడు 3,70,698 కిలోల మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం జరిగింది. అయితే ఈ మొత్తంలో 51,756 కిలోల తలనీలాలు విక్రయించబడగా రూ.83.53 కోట్ల ఆదాయాన్ని తితిదే ఇందుమూలంగా పొందింది.
తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను తితిదే ఈ-వేలంలో పెట్టింది.
కిలో రూ.20,180/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 4,756 కిలోలలను వేలానికి ఉంచగా 4,756 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.9.89 కోట్ల ఆదాయం సమకూరింది.
కిలో రూ.18,650/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 85,946 కిలోలను వేలానికి ఉంచగా 34,700 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.64.72 కోట్ల ఆదాయం సమకూరింది.
కిలో రూ.7,451/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 55,423 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 10,700 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.7.97 కోట్ల ఆదాయం లభించింది.
కిలో రూ.5,451/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 2,601 కిలోలను వేలానికి ఉంచగా 1,400 కిలోలు అమ్ముడుపోయాయి. వీటిద్వారా రూ.77 లక్షల ఆదాయం సమకూరింది.
కిలో రూ.80/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను రెండు లక్షలా 21 వేలా 190 కిలోలను వేలంలో అమ్మకానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.
కిలో రూ.9,360/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 782 కిలోలను వేలంలో ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. రూ.18 లక్షల ఆదాయం సమకూరింది.
   
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.