PATRA PUSHPAYAGAM IN KT ON MAY 5 _ మే 4న శ్రీ కపిలేశ్వరాలయంలో పత్రపుష్పయాగానికి అంకురార్పణ
TIRUPATI, 03 MAY 2023: The Ankurarpana for Patra Pushpa Yagam will be observed at Sri Kapileswara Swamy temple in Tirupati on May 4.
On May 5, the unique Patra Pushpa Yagam will be conducted in the temple between 10am and 12noon.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మే 4న శ్రీ కపిలేశ్వరాలయంలో పత్రపుష్పయాగానికి అంకురార్పణ
తిరుపతి, 2023 మే 03: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో మే 5న జరుగనున్న పత్రపుష్పయాగానికి మే 4వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, నవకలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మే 5న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామక్షి అమ్మవారి ఉత్సవర్లకు నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృతాభిషేకం, చెరుకు రసం, కొబ్బరినీళ్ళు, విబూది, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరంలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులతో స్వామి, అమ్మవార్లకు పత్ర పుష్ప యాగ మహోత్సవం చేపట్టనున్నారు.
లోక క్షేమం కొరకు, ఆలయంలో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పత్ర పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.