VASTRAMS OFFERED _ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి జేఈవో పట్టువస్త్రాల సమర్పణ

TIRUPATI, 26 SEPTEMBER 2023: TTD JEO Veerabrahmam presented Silk vastrams on behalf of Tirumala Tirupati Devasthanam to the Kanipakam temple on Tuesday evening in connection with kalyanotsavam at the famous Lord Ganesha Temple.

 He was welcomed by Kanipakam Chairman Sri Mohan Reddy and EO Sri Venkatesh. After darshan he was offered Vedasirvachanam.

It has been a tradition by TTD since many years to present silk vastrams to Kanipakam Varasiddhi Vinayaka temple on the auspicious day of Kalyanam this famous temple in Chittoor district.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి జేఈవో పట్టువస్త్రాల సమర్పణ

తిరుప‌తి, 2023 సెప్టెంబ‌రు 26: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టిటిడి తరఫున జేఈవో
శ్రీ వీరబ్రహ్మం దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ కాణిపాకంలో మంగళ వారం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం సంద‌ర్భంగా టిటిడి త‌ర‌ఫున‌ పట్టువస్త్రాలు సమర్పించిన‌ట్టు తెలిపారు. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీగా వస్తోంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వ‌ర్యాలు ప్ర‌సాదించాల‌ని శ్రీ వినాయ‌క‌స్వామివారిని ప్రార్థించిన‌ట్టు చెప్పారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి జేఈవోకు ఆల‌య బోర్డు ఛైర్మ‌న్ శ్రీ మోహ‌న్‌రెడ్డి, ఈవో శ్రీ వెంకటేష్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. ద‌ర్శ‌నానంత‌రం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.