PHOTO EXHIBITION SPEAKS THE GRANDEUR OF TTD AND TIRUMALA TEMPLE_ శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో భక్తులను ఆకట్టుకుంటున్న ఫొటో ఎగ్జిబిషన్‌

Vijayawada, 5 July 2017: The Photo Exhibition put up at the TTD model temple in the PWD grounds of Vijayawada as part of the ongoing Sri Venkateswara Vaibhavotsavams has been attracting huge foot falls.

Under the instructions of TTD Executive Officer Sri Anil Kumar Singhal, under the supervision of Tirupati JEO Sri P Bhaskar, TTD PRO Dr T Ravi made the arrangements for the photo exhibition which showcased the pictorial journey of the glory of Sri Venkateswara narrating the historical, spiritual and mythological significance and eight and a half decades delightful sojourn of the temple management of Tirumala Tirupati Devasthanams.

The exhibition also showcased the vessels and plates utilised in the daily rituals at Srivari Temple besides other puja material and also the colorful pictures of the deity in all utsava and daily rituals extolling the devotional stance and spiritual glory of Tirumala. Most of the pictures were organised in separate wings and galleries. Among the pictorial display was the journey of development and transformation of Tirumala shrine during last 80 years including, mada streets development, photos of bygone days, Travel by palakkis (dolis), special feature on the Sopana Margam (foot walkers path) from Alipiri.

Other prominent photo display included the Vaikuntham queue lines, Anna Prasadams, Idols in Srivari Temple, Various rest rooms and guest houses at Tirumala. The photos also included the thirthas at Tirumala, Srivari Brahmotsavam snaps, photos of Chief Minister and other VIPs in Srivari Seva at Tirumala.

ALL ROADS LEAD TO PWD GROUNDS

On the other hand all roads are being lead to PWD Grounds in Vijayawada where the replica temple of Lord Venkateswara has been set up by TTD since Tuesday.

On Wednesday Sahasrakalasabhishekam was performed to the Bhoga Srinivasa Murthy akin to Tirumala.

The devotees were enthralled by the very sight of the ritual and chanted Govinda Namas with religious ecstasy.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి నమూనా ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

విజయవాడ, 2017 జూలై 05: విజయవాడలోని పి.డబ్యు.డి. గ్రౌండ్స్‌లో టిటిడి ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో బుధ వారం నుండి భక్తుల తాకిడి పెరిగింది. విశేష సంఖ్యలో విచ్చేస్తున్న భక్తుల తాకిడికి ఆలయ

పరిసరాలు గోవిందనామస్మరణతో మారుమోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులకు టిటిడి సంతృప్తికరమైన దర్శనం కల్పిస్తున్నది.

టిటిడి ఉద్యోగులు, విజిలెన్స్‌ సిబ్బంది భక్తి భావంతో భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పించేందుకు పందిళ్లు,

ఆలయ పరిసరాలను నీటితో తడుపుతున్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు పులిహోర, చక్కెర పొంగలి, చిన్నలడ్డు (ఉచితంగా) అందిస్తున్నారు. టిటిడి సూచనలను అనుసరిస్తూ భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.15 గంటల వరకు నిర్వహిస్తున్న భక్తి సంగీత, సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో భక్తులను ఆకట్టుకుంటున్న ఫొటో ఎగ్జిబిషన్‌

శ్రీవారి వైభవోత్సవాలలో భాగంగా విజయవాడ పి.డబ్ల్యు.డి. గ్రౌండ్స్‌లోని స్వామివారి నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అరుదైన ఛాయాచిత్రాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని, చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే పలు ఫొటోలు భక్తులకు కనువిందు
చేస్తున్నాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యపూజా విధానంలో వివిధ సందర్భాలలో వినియోగించే పాత్రలు, పూజా ద్రవ్యాల ఛాయాచిత్రాలు ప్రదర్శనలో వున్నాయ. శ్రీవారు ప్రత్యేక పర్వదినాలు, ఇతర ఉత్సవాల దినాల్లో పూజలు అందుకునే ఉత్సవమూర్తుల ఫొటోలు భక్తిబావాన్ని పెంచుతున్నయి. ఆయా అంశాలకు సంభందించి ప్రత్యేకంగా విడివిడిగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

ఇందులో తరతరాల తిరుమల పేరిట 80 సంవత్సరాల క్రితం శ్రీవారి ఆలయ చరిత్రను కళ్లకు కట్టే అరుదైన ఫొటోలు భక్తులను ఆకట్టుకుంటున్నయి. వీటిలో ఆకాలం నాటి ఆలయాలు, మండపాలు, తిరుమల కొండకు చేరుకునే డోలిలు, మాడవీధుల విస్తరణ తదితర ఫోటోలు వున్నాయి. ఆలిపిరి కాలిబాట, శ్రీవారి మెట్టు మార్గంలోని విశేషాల ఫోటోలు, తిరుమల ఘాట్‌ రోడ్డు, తిరుమల తిరుపతిలోని విశ్రాంతి భవన సమూదాయాలు, క్యూలైన్లు, ప్రసాదాలు, శ్రీవారి ఆలయంలోని విగ్రహలు, పంచబేరాలు, ఇతర విశేషాల ఫొటోలు వున్నాయి.

శ్రవారి బ్రహ్మోత్సవాలు, శ్రీవారి సేవలో రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, తిరుమల తిరుపతిలోని శ్రీవారి సేవ వ్యవస్థ ఫొటోలను ఆధిక సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు
ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు ఫ్లెక్సీలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆదేశాల మేరకు ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి పర్యవేక్షణలో ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నారు.


తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.