PEDDA SESHA VAHANAM OBSERVED_ పెద్దశేష వాహనంపై గోవిందుడి వైభవం :

Tirupati, 21 May 2018: On the first day evening Lord Sri Govinda Raja Swamy accompanied by His two consorts Goddesses Sri Devi and Bhu Devi took celestial ride on Pedda Sesha Vahanam on Monday.

The devotees converged in huge numbers to witness Lord on the seven hooded Pedda Sesha Vahanam which glided along the streets. The surroundings reverberated with Govinda Naman.

HH Sri Sri Pedda Jeeyar, HH Sri Sri Chinna Jeeyar, Temple DyEO Smt Varalakshmi, AEO Sri Uday Bhaskar Reddy, Suptd Sri Gyana Prakash, Temple Inspector Sri Krishanmurthy and others took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పెద్దశేష వాహనంపై గోవిందుడి వైభవం :

తిరుపతి, 2018 మే 21: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి 8 గంటల నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో శ్రీగోవిందరాజ స్వామిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు ప్రబోధిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, కంకణభట్టార్‌ శ్రీఎ.పి.శ్రీనివాసదీక్షితులు, ఏఈవో శ్రీఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.