PREZ OFFERS PRAYERS IN TIRUCHANOOR TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌ : రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

TIRUPATI, 05 DECEMBER 2022: The Honourable President of India Smt Droupadi Murmu offered prayers in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor on Monday afternoon during her maiden visit to the pilgrim centre.

 

On her arrival at the main entrance of the temple, she was received by TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy. The Archakas welcomed the first citizen of India with the traditional Purnakumbham.

 

Later she had the darshan of Goddess Sri Padmavathi Devi along with her entourage. The Prez was presented with Sesha Vastram inside the sanctum sanctorum.

 

After Darshan, the President expressed her immense pleasure about the arrangements with TTD Chairman and the EO.

 

Union Minister Sri Kishen Reddy, Deputy CMs Sri Narayana Swamy, Sri Satyanarayana, AP Minister Smt Roja, Collector Sri Venkatramana Reddy, SP Sri Parameshwar Reddy were present.

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, Temple DyEO Sri Lokanatham and others were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌ : రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

తిరుపతి 5 డిసెంబరు 2022: భారత గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సోమవారం మధ్యాహ్నం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జేఈవో లు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీరబ్రహ్మం సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ పుష్పగుచ్ఛాలు అందించిస్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గౌరవ రాష్ట్రపతి ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ,ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి గౌరవ రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.

ఉప ముఖ్యమంత్రులు శ్రీ నారాయణ స్వామి ,శ్రీ కొట్టు సత్యనారాయణ , కేంద్ర మంత్రి
శ్రీ కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్ కె రోజా , జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణా రెడ్డి , జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి , చెన్నె టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు , ఆలయ డిప్యూటీ ఈవో
శ్రీ లోకనాథం, ఆగమ సలహా దారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబు స్వామి, శ్రీ మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు.

దర్శనం బాగా జరిగింది : రాష్ట్రపతి

దర్శనం బాగా జరిగిందని గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అయిన గౌరవ రాష్ట్రపతి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో శ్రీ ధర్మారెడ్డి లతో మాట్లాడుతూ తిరుమల, తిరుచానూరులో దర్శనం ఏర్పాట్లు బాగా ఉన్నాయని సంతోషంగా చెప్పారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.