PURUSHA MRIGA VAHANAM OBSERVED _ పురుషామృగ వాహనంపై సోమస్కందమూర్తి
TIRUPATI, 02 MARCH 2022: On the Ninth day ongoing annual brahmotsavam in kapileswara Swamy temple at Tirupati, Purusha Mriga vahanam observed on Wednesday.
In the evening between 5pm and 7pm Siva Parvati Kalyanotsavam will be observed in Ekantam.
Temple DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati, Temple Inspectors Sri Reddy Sekhar, Sri Srinivasa Naik were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
పురుషామృగ వాహనంపై సోమస్కందమూర్తి
తిరుపతి, 2022 మార్చి 02: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన బుధవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. వాహనసేవ ఆస్థానం తరువాత స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.
సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు శివపార్వతుల కల్యాణ మహోత్సవం ఏకాంతంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు తిరుచ్చిపై స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం దంపతులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ సత్రే నాయక్, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.