PUSHPA YAGAM PERFORMED AT SRIVARI TEMPLE _ వేడుకగా వెంకన్న పుష్పయాగం
SNAPANAM HELD FOR UTSAVA MURTHIES
COLOURFUL PROCESSION OF FLOWERS HELD
Tirumala, 21 Nov. 20: The colourful festival of flowers, Pushpa Yagam was organised at Srivari temple on Saturday on the occasion of Shravana nakshatra during the auspicious month of Karthika.
Earlier, in the morning, after second Archana and second bell, Naivedyam, Snapana Tirumanjanam was performed at Kalyana Mandapam. The special Abhisekam is performed to utsava idols with milk, curd, honey, sandal, turmeric and scented perfumed waters.
Later the Additional EO Sri AV Dharma Reddy attended the puja performed to these flowers at Garden office. Speaking to media on this occasion, he said inscriptions say that the festival was celebrated in Srivari temple since 15th century to usher in greenery and prosperity in the country. The legends also say that Pushpa yagam is generally conducted on the seventh day after Dwajavarohanam of Brahmotsavam festival. He said TTD resumed Pushpa yagam mahotsavam in 1980, on November 14.
The flowers were carried to Srivari temple in a colourful procession from the Garden Department by staff and srivari sevaks.
Thereafter in the afternoon, Pushpa Yagam is performed between 1.00 pm and 5.00 pm with seven tons of 14 varieties of traditional and cut flowers like rose, Jasmine, Kanakambaram, Lillies, Ixora, ganneru, chrysanthemum and six other varieties of scented leaves.
Later in the evening, Sri Malayappa blessed devotees on Mada streets after Sahasra Deepalankara seva in the evening.
TTD had cancelled arjita sevas like Kalyanotsavam, Unjal Seva, arjita Brahmotsavam etc. in view of this religious event.
Temple DyEO Sri Harindranath, Garden wing Chief Sri Srinivasulu, VGO Sri Bali Reddy, temple Peishkar Sri Jagan Mohanacharyulu, AVSO Sri Veera Babu and others participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వేడుకగా వెంకన్న పుష్పయాగం
తిరుమల, 2020 నవంబర్ 21: పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు.
శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, వృక్షి, సంపంగి, సెంటు జాజులు, పొగడ, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.
పుష్పాధిదేవుడు ”పుల్లుడు” ఆవాహన
పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
పుష్పయాగానికి మొత్తం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు నుండి 4 టన్నులు, కర్ణాటక నుండి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కలిపి ఒక టన్ను పుష్పాలు, పత్రాలను దాతలు అందజేశారు.
ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం
శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులును టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ జగన్‌మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.