RADHASAPTHAMI FERVOUR GRIPS LOCAL TEMPLES _ టిటిడి స్థానికాలయాల్లో ఘనంగా రథసప్తమి
Tirupati, 19 Feb. 21: The annual fete Radhasapthami was observed with grandeur in all TTD-run temples in and around Tirupati on Friday.
While in Sri Kodandaramalayam, Suryaprabha and Chandraprabha Vahanams were observed in the morning and in the evening, in Srinivasa Mangapuram and at Appalayagunta Tiruchi was observed in the morning.
In the temples at Narayanavanam and Nagalapuram all the vahana sevas were observed in Ekantam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి స్థానికాలయాల్లో ఘనంగా రథసప్తమి
తిరుపతి, 2021 ఫిబ్రవరి 19: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినాన్నిశుక్రవారం ఘనంగా నిర్వహించారు.
కాగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయాల్లో రథసప్తమి వేడుకలను శుక్రవారం ఏకాంతంగా నిర్వహించారు.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో…
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు సూర్యప్రభవాహనం స్వామివారు భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ జయకుమార్, శ్రీ మునిరత్నం ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు బంగారు తిరుచ్చిపై స్వామివారు దేవేరులతో కలసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. అనంతరం ఆలయంలో ఆస్థానం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధనంజయులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్‌రాయులు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ….
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకుని సంపంగి ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను ఏకాంతంగా ఊరేగించారు.
ఉదయం 6.30 గంటల నుండి సూర్యప్రభ, చిన్నశేష, హంస, కల్పవృక్ష, పెద్దశేష వాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ భాస్కర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ….
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఆలయంలోని ధ్వజస్థంభం వరకు ఏకాంతంగా స్వామి, అమ్మవార్లను ఊరేగించారు.
ఉదయం 6 గంటల నుండి సూర్యప్రభ, హంస, కల్పవృక్షవాహన సేవలు, తిరుచ్చి ఉత్సవంపై జరిగింది. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శేషవాహనం, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు ఆలయంలో ఊరేగనున్నారు.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ….
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.