RAHUGRASTA CHOODAMANI SURYA GRAHANA JAPA YAJNAM HELD AT TIRUMALA FOR THE WELL BEING OF HUMANITY _ జీవ‌కోటి ఆరోగ్యం కొర‌కు తిరుమ‌లలో సూర్య‌గ్ర‌హ‌ణ జ‌పయ‌జ్ఞం

Tirumala, 21 Jun. 20: To promote global peace and seeking good health for the entire humanity, TTD has organized Rahugrasta Choodamani Surya Grahana Japa Yajnam in the Swamy Pushkarini at Tirumala on Sunday.

The partial Solar Eclipse was observed between 10:18am till 1:38pm. Till this time the unique Japa Yagnam was carried with utmost devotional fervour in the temple tank.

HH Sri Pedda Jiyar Swamy, HH Sri Chinna Jiyar Swamy of Tirumala, EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, Veda Vignana Peetham Principal Sri KSS Avadhani, Archakas of Srivari temple, Jeeyangars, Veda Parayanadars and TTD senior officials participated. 

 

As the Grahanam lasted for over three and a half hours, the sacred programme is divided into six halves. In the first half, the Jeeyangars, their staff and Srivari temple Archakas chanted the Astakshari Mantra-“Om Namo Narayanaya” and Dwadasakshari Mantra-“Om Namo Bhagavate Vasudevaya” between 10:18am and 11.00am.

In the second half, the Veda Parayanmdars of Srivari temple recited the Sri Purusha Suktam between 11am and 11:30am.

In the half, between 11.30 am and 12.00noon, the Veda Pundits of Dharmagiri Veda Vijnana Peetham presented the Sri Sukta Parayanam.

As a part of the holy Japa in the fourth half, the Scheme Veda Parayanamdars recited Sri Narayana Suktam between 12noon and 12:30pm and in fifth phase they recited Sri Dhanvanthri Mantra Japam between 12:30pm and 1pm.

In the final half, between 1pm and 1:38pm the Scheme Veda parayanadars chanted the Dasa Shanti Mantra. SVBC is live telecasting the entire programme for the sake of global devotees. 

Srivari Seva volunteers also participated in observing social distance.

AUSPICIOUS DAY

Speaking to media, TTD Agama Advisor Sri Mohana Rangacharyulu said, the Choodamani Surya Grahanam is so auspicious as it occurred on Sunday. Chanting divine namams on this day will yield prosperity to the entire humanity, he added.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జీవ‌కోటి ఆరోగ్యం కొర‌కు తిరుమ‌లలో సూర్య‌గ్ర‌హ‌ణ జ‌పయ‌జ్ఞం

 తిరుమ‌ల‌, 2020 జూన్ 21: కక‌రోనా వైర‌స్ న‌శించి,  ప్రపంచంలోని స‌మ‌స్త జీవ‌కోటి ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ శ్రీ‌వారి పుష్క‌రిణిలో ఆదివారం రాహుగ్ర‌హ చూడామ‌ణి సూర్య‌గ్ర‌హ‌ణ జ‌ప‌య‌జ్ఞం నిర్వ‌హించారు. టిటిడి నిర్వ‌హించిన ఈ జ‌ప య‌జ్ఞంలో టిటిడి శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ్యర్‌స్వామి,  ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యు‌లు శ్రీ కృష్ణ‌మూర్తి వైధ్య‌నాథ‌న్,  ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆలయ అర్చ‌కులు, వేద పండితులు పాల్గొన్నారు.  

ఆదివారం ఉదయం 10.18 గంట‌లకు గ్ర‌హ‌ణం ప్రారంభ‌మై మ‌ధ్యాహ్నం 1.38 గంట‌లకు గ్ర‌హ‌ణం ముగిసే వ‌ర‌కు శ్రీ‌వారి పుష్క‌రిణిలో నిల‌బ‌డి ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఉద‌యం 10.18 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు మొద‌టి విభాగంలో 15 మంది శ్రీ‌వారి ఆల‌య అర్చ‌కులు, జీయ్యంగార్ల సిబ్బంది అష్టా‌క్ష‌రి మంత్రం ( ”ఓం న‌మో నారాయ‌ణాయ‌),  ద్వాద‌‌శాక్ష‌రి మంత్రాలను (ఓం న‌మో భ‌గ‌‌వ‌తే వాసుదేవాయ)  జ‌పించారు.

ఉద‌యం 11.00 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు రెండ‌వ విభాగంలో 15 మంది తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య వేద పారాయ‌ణ‌దారులు ”శ్రీ పురుష సూక్త జ‌పంస‌స ప‌ఠించారు. ఉద‌యం 11.30 నుండి 12.00 గంట‌ల వ‌ర‌కు మూడ‌వ విభాగంలో తిరుమ‌ల ధ‌ర్మ‌గిరిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విజ్ఞాన పీఠంకు చెందిన వేద పండితులు ”శ్రీ సూక్త మంత్రం  ”‌ జ‌పం చేశారు.

వేద పారాయ‌ణ పండితులు  4, 5, 6వ విభాగాల‌లో ఒక్కొక్క విభాగానికి 15 మంది చొప్పున మ‌ధ్యాహ్నం 12.00 నుండి 12.30 గంట‌ల వ‌ర‌కు ”శ్రీ నారాయ‌ణ సూక్త జ‌పం”, మ‌ధ్యాహ్నం 12.30 నుండి 1.00 గంట‌ల వ‌ర‌కు ”శ్రీ ధ‌న్వంత‌రి మంత్ర జ‌పం ”, చివ‌రిగా మ‌ధ్యాహ్నం 1.00 గంట నుండి 1.38 గంట‌ల వ‌ర‌కు ”ద‌శ శాంతి మంత్ర‌ము”ల‌ను జ‌పించారు.

ఒక్క‌సారి మంత్రం జ‌పిస్తే కోటి సార్లు జ‌పించిన పుణ్యం  – శ్రీ మోహ‌న రంగాచార్యులు

ఆదివారం ఏర్ప‌డిన చూడామ‌ణి సూర్య‌గ్ర‌హ‌ణం స‌మ‌యంలో ప్ర‌జ‌లు త‌మ ఇష్ట దైవాన్ని ఒక్క సారి జ‌పిస్తే కోటిసార్లు జ‌పించిన ఫ‌లితం ద‌క్కుతుంద‌ని టిటిడి ఆగ‌మ స‌ల‌హాదారు ‌శ్రీ మోహ‌న రంగాచార్యులు తెలిపారు. మామూలు గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ఒక్క సారి జ‌పిస్తే ల‌క్ష సార్లు జ‌పించిన ఫ‌లితం ల‌భిస్తుంద‌న్నారు. అయితే ఈ చూడామ‌ణి సూర్య‌గ్ర‌హ‌ణం రోజున సంక‌ల్పం-స్నానం-త‌ర్ప‌ణం- దానం చాలా విశేష‌మ‌న్నారు. టిటిడి నిర్వ‌హించే అనేక ధార్మిక కార్య‌క్ర‌మాలు, ట్ర‌స్టుల‌కు దానాలు చేయ‌డం వ‌ల‌న శ్రీ‌వారి అనుగ్ర‌హంతో కోటి రెట్లు ఫ‌లితం ల‌భిస్తుంద‌ని వివ‌రించారు. ఈ జ‌ప యజ్ఞం కార‌ణంగా  క‌రోనా వైర‌స్ త్వర‌గా న‌శించి జీవ రాశుల‌కు ఆరోగ్యం చేకూరుతుంద‌న్నారు.

టిటిడి సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు భౌతిక‌దూరం పాటిస్తూ శ్రీ‌వారి పుష్క‌రిణి మెట్లపై కూర్చుని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌పయ‌జ్ఞం చేశారు.‌

 ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ‌ధానిపాల్గొన్నారు.

73వ రోజుకు చేరిన వేద‌పారాయ‌ణం –

తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై టిటిడి నిర్వ‌హిస్తున్న వేద పారాయ‌ణం ఆదివారం 73వ రోజుకు, సుంద‌రాకాండ పారాయ‌ణం 11వ రోజుకు చేరుకున్నాయి. ప్ర‌తి రోజు ఉద‌యం 7.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించే వేద పారాయ‌ణం చూడామ‌ణి సూర్య గ్ర‌హ‌ణం కార‌ణంగా శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం అనంత‌రం మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల నుండి 4.00 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించారు.   గ్ర‌హ‌ణం అనంత‌రం దానం చేయ‌డం వ‌ల‌న శుభం క‌లుగుతుంద‌ని పండితులు పేర్కొన్న‌రీత్యా అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్, వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ‌ధానికి దానం ఇచ్చారు.  ‌

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.