RANGAPATHI SPARKS ON RADHARANGA DOLOTSAVAM_ స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం

Tirumala, 28 September 2017: In the pleasant evening on Thursday, the Lord Malayappa Swamy flanked by His two consorts Sridevi and Bhudevi on His either sides, dazzled on the Swarna Ratham and blessed the devotees.

The richness, majesty and grandeur of Lord Malyappa Swamy is clearly exhibited on the glittering golden chariot procession-Radharanga Dolotsavam. After taking rides all alone on His favourite cars, Garuda and Hanumantha consecutively, the Lord took a colourful ride with His two consorts, Sridevi and Bhudevi on the Swarna Ratham.

All the three deities decked in Pattu Vastrams and precious stone studded gold jewels, took a majestic ride on Swarna Ratham and the beauty of the mighty chariot enhanced when the setting rays of the Sun fell on it giving a new look.

Legends say that The practice of Rathotsavam began during the period of Vijayanagara king Sri Krishnadevaraya who had donated gold to the Srivari temple. The practice has been continued even today as part of the Brahmotsvam and also on some other significant festivals at Tirumala.

TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Rama Rao and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS

OFFICER, TTDs,TIRUPATI

స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం

తిరుమల, 28 సెప్టెంబరు 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు శ్రీవారు బంగారుతేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో కరుణిస్తాడు. బ్రహ్మదేవుని శూన్యరథం, గజ, అశ్వ, వృషభాదుల సంరంభం ఈ స్వర్ణరథోత్సవంలో కూడా వుంటుంది. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలంతోను మాడవీధులు కడురమణీయంగా జరుగనుంది.

శ్రీవారికి శ్రీభూదేవులు ఇరుప్రక్కలా ఉంటారు. శ్రీదేవి(లక్ష్మి) సువర్ణమయ. సువర్ణరూప. ఆమే బంగారుకాగా – ఆమెను భరించే స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందంకదా! బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహాశక్తిమంతమైన లోహం. స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేవి నాల్గుగుర్రాలు. శ్రీవారి ఇల్లు బంగారం. ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు బంగారువి. సింహాసనం బంగారుది. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది.

‘స్వర్ణ’ మంటే ‘బాగా ప్రకాశించేది’ అని వ్యుత్పత్తి. స్వర్ణం లభించేది భూమినుండే. కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవీ ఉండగా శ్రీవారుమధ్యలో ఉండి, స్వర్ణరథంలో ఊరేగడం – స్వామివారి మహోన్నతినీ, సార్వభౌమత్వాన్నీ, శ్రీసతిత్వాన్నీ, భూదేవీనాథత్వాన్నీ సూచిస్తూంది.

ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ; శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.