RATHA SAPTHAMI AT SKVST _ తిరుచ్చిపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి అభయం

Srinivasa Mangapuram , 01 Feb 20 ; As a part of Surya Jayanti and Ratha Sapthami, TTD has organised Tiruchi vahana seva at Sri Kalyana Venkateswara temple in Srinivasa Mangapuram on Saturday.

The utsava idols of Sri Kalyana Venkateswara and His consorts were paraded on Bangaru Tiruchi after morning rituals both in the morning and again in the evening to bless the  devotees.

DyEO Sri Yellappa, Superintendent Sri  Chengalrayulu, Temple Inspector Sri Anil Kumar and other officials, devotees participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

తిరుచ్చిపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి అభయం
         

తిరుపతి, 2020 ఫిబ్ర‌వరి 01: సూర్యజయంతిని పురస్కరించుకొని శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో రథసప్తమి వేడుకలు శ‌నివారం ఘనంగా జరిగాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.
         

ఇందులో భాగంగా ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంలో మేల్కొలిపి, తోమాల‌, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం, అర్చ‌న నిర్వ‌హించారు. అనంత‌రం ఉదయం 6.30  నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. కాగా సాయంత్రం 6.30 నుండి 7.30 బంగారు తిరుచ్చిపై స్వామివారు దేవేరులతో కలసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్త‌లు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.