RETRACTABLE ROOF PROVIDING GOPURA DHWAJA DARSHAN TO DEVOTEES AFTER MANY DECADES-TTD EO_ ఆన్‌లైన్‌లో 56,424 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :

Tirumala, 2 March 2018: The retractable roof which was set up in Tirumala temple to shield the pilgrims during inclement weather, is enabling devotees to have Dhwajastambha Darshan after many decades, said, TTD EO Sri Anil Kumar Singhal.

Before taking calls from pilgrims during monthly Dial your EO programme at Annamaiah Bhavan in Tirumala on Friday, briefing the pilgrims on developmental activities, the EO said, earlier due to the covering, the devotees are void of taking a look at tip of the temple pillar as the roof shielded the pillar and the sky as well. But now as we made the retractable roof, it remains open enabling the devotees to cherish the sight of the temple pillar with a back drop sky providing them a unique experience”, he added.

RETRACTABLE ROOF IN GALLERIES

Reacting to the pilgrim caller Sri Rajendra from Kakinada, the EO said, they will discuss the possibilities of erecting retractable roof for galleries in mada streets.

ONLINE LUCKY DIP FOR TRANSPARENCY

Answering the pilgrim callers Sri Saiprasad from Peddapuram, Sri Venkat Rao from Vizag, Sri Mallaiah from Miryalaguda, Sri Rajasekhar from Anantapuram, Sri Maheswara Rao from Telengana, the EO said, TTD has commenced on-line dip of arjitha seva tickets for transparency. He said the details of the quota release are also being scrolled in SVBC every time the tickets are released for the information of the pilgrims.

HI-FI CHECKING SYSTEM SOON

When a pilgrim Smt Nagamani from Nagaram sought EO to introduce machine based physical frisking instead of manual as it is causing inconvenience especially aged women devotees, answering her EO said, very soon new Hi-fi system will replace manual frisking in Tirumala.

PRESCRIBED NORMS FOR ROOMS ALLOTMENT

Responding to callers Sri Bhavanarayana from Guntur, Sri Tirupati Rao from Khammam, Sri Subhash from Surat who sought importance to VIP letters during cottage allotment, the EO said, there are some prescribed norms to allot rooms to the VIP recommendation letters also. As per the norms, rooms will be allotted in Koustubham. For darshan, the JEO office will entertain letters upto 3pm. Rooms will be allotted on first cum first basis in CRO without any recommendation in a transparent manner.

ALLOW VISULLAY DISABLED NEAR TO LORD

A pilgrim caller Sri Venkateswarulu from Chennai sought EO to permit visually handicapped devotees closure to Lord for which EO replied as such it is not possible as daily 70thousand pilgrims throng Tirumala.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

మార్చి 02, తిరుమల 2018: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు.

ఈ నెలలోనే సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ : సర్వదర్శనం భక్తులు కంపార్ట్‌మెంట్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఈ నెలాఖరులో టైంస్లాట్‌ విధానాన్ని అమలుచేస్తాం. తిరుపతిలో 55 కౌంటర్లు, తిరుమలలో 35 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కౌంటర్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ప్రత్యేక దర్శనాలు : వ ద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రతినెలా 2 రోజుల పాటు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా మార్చి 6, 20వ తేదీల్లో వ ద్ధులు, దివ్యాంగులకు, మార్చి 7, 21వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.ఈ అవకాశాన్ని వ ద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.

శ్రీవారి ఆలయంలో ముడుచుకునే పైకప్పు : శ్రీవారి ఆలయంలో భక్తులకు ఎండకు, వర్షానికి ఇబ్బందులు లేకుండా చేయడంతోపాటు ఆలయ శిల్ప సౌందర్యాన్ని దర్శించుకునేందుకు వీలుగా ముడుచుకునే పైకప్పును ఏర్పాటు చేస్తున్నాం.

ఉగాది ఆస్థానం : మార్చి 18వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో విళంబినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా టిటిడి ఆస్థాన పండితులు ఆస్థానం, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఇందులో దేశకాల, ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారఫలాలను పండితులు తెలియజేస్తారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ బ్రహ్మూెత్సవాలు : టిటిడికి అనుబంధంగా ఉన్న పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈనెల 24 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మూెత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం.

మార్చి 30వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరుగనుంది. భక్తులు విచ్చేసి బ్రహ్మూెత్సవాల వైభవాన్ని తిలకించాలని కోరుతున్నాం.

శ్రీవారి సేవ : భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు శ్రీవారి సేవ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం. భక్తులు వ్యక్తిగతంగా నమోదు చేసుకునేందుకు వీలుగా 3 రోజులు, 4 రోజుల స్లాట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతాం. యువత, విద్యావంతులు, ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఐలు ఈ స్లాట్లను బుక్‌ చేసుకుని శ్రీవారి సేవకు రావాలని కోరుతున్నాం.

శ్రీ విళంబినామ సంవత్సర పంచాంగం : శ్రీ విళంబినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల,తిరుపతిలోని టిటిడి బుక్‌స్టాళ్లలో అందుబాటులో ఉంచాం.హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉంది.

ఆలయాల నిర్మాణం : రూ.22.50 కోట్లతో తమిళనాడులోని కన్యాకుమారిలో, రూ.34.60 కోట్లతో హర్యానాలోని కురుక్షేత్రలో శ్రీవారి ఆలయాల నిర్మాణపనులు పూర్తికావస్తున్నాయి. చైన్నైలో రూ.7 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రూ.6.70 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తాం.

తిరుపతి రోడ్ల అభివృద్ధి : అలిపిరి, శ్రీవారి మెట్టు, తిరుమల రెండు ఘాట్‌ రోడ్లు, తిరుపతిలోని టిటిడి పరిధిలోని 26 కి.మి. రోడ్లలో మొక్కల పెంపకం, నీటి సరఫరకు టెండర్లు పూర్తయ్యాయి. అలిపిరి, చెర్లోపల్లి రోడ్డు అభివృధి పనులను చేపట్టాం. శ్రీవారి ఆలయంలో ఎలాంటి రసాయనాలు వాడకుండా నేచురల్‌ హెర్బల్‌ పేస్టును అతికించిన అనంతరం శుభ్రం చేయడం వల్ల మరింత కాంతివంతంగా వుంటుంది. అందువల్ల రాతి స్థంభాలు, రాతి కట్టడాలను పరిశుభ్రం చేసేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ రాతి కట్టడం శుభ్రం చేసాం. తిరువవకుళమాతా ఆలయాన్ని సకాలంలో పూర్తిచేస్తాం. ఎస్వీబీసీ, తిరుమల హోటల్స్‌, అన్యమత ఉద్యోగులు విషయంలో కోర్టు ఇచ్చే ఆదేశాలను అమలుచేస్తాం.

‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన జూన్‌ నెల కోటాలో మొత్తం 56,4247 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 11,149 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,854, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 45,275 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1,125, కల్యాణం 10,875, ఊంజల్‌సేవ 2,900, ఆర్జితబ్రహ్మూెత్సవం 6,235, వసంతోత్సవం 9,890, సహస్రదీపాలంకారసేవ 14,250 టికెట్లు ఉన్నాయని వివరించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. మల్లయ్య – మిర్యాలగూడ. మధుసూదన్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: శ్రీవారి ఆర్జీతసేవ టికెట్లు ఆన్‌లైన్‌లో పొందడం ఇబ్బందిగా ఉంది. ఈ దర్శన్‌ కౌంటర్లు ఏర్పాటు చేయండి?

ఈ.వో. ఆర్జీత సేవ టికెట్లు భక్తులందరికి పాదర్శకంగా అందుబాటులో ఉంచేందుకు టిటిడి ఆన్‌లైన్‌ విధానం ప్రారంభించింది. ఇంటర్‌నెట్‌ ద్వారా ఆన్‌లైన్‌ టికెట్లు పొందవచ్చు.

2. కుమార్‌ – మదనపల్లి

ప్రశ్న: తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో రోగులకు టిటిడి ఉచిత అన్నప్రసాదాలు అందిస్తుంది. కాని, సిబ్బంది అన్నప్రసాదాలను సరిగ్గా పంపిణీ చేయకపోవడం వల్ల ఎక్కువగా వృధా అవుతుంది. చర్యలు తీసుకోండి.

ఈ.వో. సీనియర్‌ అధికారులతో పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

3. భవాని – విశాఖ, శ్రీనివాసరావు – విజయవాడ

ప్రశ్న: కల్యాణం టికెట్లు పొందాం. అయితే 13 సంవత్సరాల పిల్లలను అనుమతించలేదు ?

ఈ.వో. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అనుమతించడం లేదు. ఈ అంశంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.

4. ప్రవీణ్‌ – చత్తీస్‌ఘడ్‌

ప్రశ్న: అలిపిరి నడకమార్గంలో నీటి లీకేజీల వల్ల భక్తులు జారీ పడుతున్నారు. తిరుమల ఆలయం పక్కనున్న క్యూలైన్‌లో కూడా లీకేజీలు ఉన్నాయి ?

ఈ.వో. అలిపిరి మార్గం, తిరుమల శ్రీవారి ఆలయం పక్కన ఎలాంటి లీకేజీలు లేకుండా చర్యలు తీసుకున్నాం. మరోసారి మా అధికారులు పరిశీలిస్తారు.

5. సాయిప్రసాద్‌ – పెద్దాపురం, వెంకటరావు – విశాఖ

ప్రశ్న: ప్రతినెలా లక్కీడిప్‌లో ఆర్జిత సేవలకు దరఖాస్తు చేస్తున్నాం. ఇప్పటికి వరకు తమకు టికెట్లు లభించడంలేదు. ఈ విధానాన్ని మార్చే అవకాశం ఉందా. తిరుమలలో వసతి కేటాయింపులో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ?

ఈ.వో. భక్తులందరికీ పారదర్శకంగా ఆర్జిత సేవలు కేటాయించేందుకు లక్కీడిప్‌ విధానాన్ని అమలుచేస్తున్నాం. ఈ పద్దతిలో సరాసరి లక్ష మందికిపైగా భక్తులు దరఖాస్తు చేస్తున్నారు. పరిమితంగా ఆర్జిత సేవలు ఉండటం వల్ల దరఖాస్తు చేసుకున్నవారందరికీ కేటాయించలేక పోతున్నాం. తిరుమలలో 4వేల వసతి గదులు ఉండటం వల్ల కేటాయింపులో ఆలస్యమవుతోంది. వచ్చే ఏడాది నుంచి తిరుపతిలో వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

6. మునిరెడ్డి – చిత్తూరు, రామానందరావు – హైదరాబాద్‌, నారాయణన్‌ – చెన్నై

ప్రశ్న: వృద్ధులు, వికలాంగుల కోటాలో స్థానికులు ఎక్కువ మంది దర్శనానికి రావడం వల్ల ఇతరులకు అవకాశం రావడం లేదు, కావున 6 నెలల వ్యవధిలో శ్రీవారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోండి ?

ఈ.వో. నెలకు రెండు రోజులలో రోజుకు 4 వేలు, సాధారణ రోజులలో 1400 టోకెన్లను వృద్ధులు, దివ్యాంగులకు కేటాయిస్తున్నాం. వృద్ధులకు ఎలాంటి షరతులు విధించలేదు. వారికి కేటాయించిన సమయంలో టోకెన్ల కేటాయింపు కేంద్రానికి చేరుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా.
7. నాగమణి – నగరం

ప్రశ్న: స్వామివారికి ముడుపులు చెల్లించే విషయంలో క్యూలైన్‌లో భద్రతాసిబ్బంది ఇబ్బంది పెట్టారు. కావున ఆధునిక భద్రాత పరికరాలతో తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోండి ?

ఈ.వో. భక్తులకు ఇబ్బంది లేకుండా త్వరలో విక్యూసిలోని రెండు హాల్స్‌లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం.

8. రాజశేఖర్‌ – అనంతపురం

ప్రశ్న: లక్కీడిప్‌లో ఆర్జిత సేవ టికెట్లు పొందాం. అనివార్య కారణాల వల్ల రాలేకపోయాం. ఆర్జిత సేవ టికెట్ల తేదిని మార్చుకునే వెసులుబాటు కల్పించండి?

ఈ.వో. ఆన్‌లైన్‌లో మార్పులు చేయడం సాధ్యంకాదు.

9. రెడ్డెప్పరెడ్డి – తిరుపతి

ప్రశ్న: స్వామివారి దర్శనానికి సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులతో కల్యాణం టికెట్లు పొందిన భక్తులను అనుతించడం వల్ల తోపులాటలు జరుగుతున్నాయి.?

ఈవో. తోపులాటలు లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నాం.

10. వేంకటేశ్వర్లు – చెన్నై

ప్రశ్న: వృద్ధులకు కంటిచూపు సరిగా లేకపోవడం వల్ల జయ విజయుల నుంచి స్వామివారి చూడలేకపోతున్నాం. స్వామివారి సన్నిధికి అనుమతించండి?

ఈవో. ప్రతి రోజు సరాసరి 60 వేల నుంచి 75 వేల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. కావున అలా అనుమతించడం కుదరదు.

11. భావనారాయణ -గుంటూరు, తిరుపతిరావు – ఖమ్మం, సుభాష్‌ – సూరత్‌

ప్రశ్న: సిఫార్సు లేఖలు తీసుకువచ్చినా వసతి, దర్శన కేటాయింపులలో సరైన గౌరవం లభించడం లేదు. బ్రహ్మూెత్సవాలలో సామాన్య భక్తులకు తిరుమలలో వసతి గదులు లభించడం లేదు. ?

జెఈవో. సిఫార్సు లేఖలు తీసుకువచ్చిన వారికి కౌస్తుభం వద్ద వసతి కేటాయిస్తారు. దర్శనం కోసం తీసుకువచ్చే దరఖాస్తులను జెఈవో ఆఫీసులో మధ్యాహ్నం 3 గంటల వరకు అనుతిస్తున్నాం. నియమ నిబంధనల ప్రకారం సమయపాలనలో వచ్చిన వారిని అనుతిస్తున్నాం. గదుల కేటాయింపులో ఎవరి ప్రమేయం లేకుండా సీఆర్వో కార్యాలయంలో నమోదు చేసుకున్నవారికి కేటాయిస్తున్నాం.

12. శ్రీనివాస్‌ -తెలంగాణ

ప్రశ్న: శ్రీవారి సేవ చేసేందుకు 60 సంవత్సరాలు పైబడిన వారిని అనుతించండి?

ఈవో. 60 సంవత్సరాలు పైబడిన వారిని శ్రీవారి సేవకు అనుతించడం లేదు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.

13. రాజేంద్ర -కాకినాడ

ప్రశ్న: ఎండలు, వర్షానికి ఇబ్బంది లేకుండా భక్తుల సౌకర్యార్థం తిరుమల మాడ వీధులలోని గ్యాలరీలలో రేకులు ఏర్పాటు చేయండి?

ఈవో. ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.

14. రమణ – హైదరాబాద్‌

ప్రశ్న: బ్రహ్మూెత్సవాలలో దాతలకు ప్రత్యేకంగా వసతి సౌకర్యం కల్పించండి?

ఈవో. బ్రహ్మూెత్సవాలలో లక్షలాది మంది భక్తులు వస్తుండటం వల్ల ప్రత్యేకంగా వసతి సౌకర్యం కల్పించడం సాధ్యం కాదు. త్వరలో తిరుపతిలో వసతి ఏర్పాట్లు చేపడుతున్నాం.

15. అమరేశ్వర్‌ – విజయవాడ

ప్రశ్న: స్వామివారి దర్శనానంతరం పంపిణీ చేసే ప్రసాదాలకు కొద్ది మంది సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నారు?

ఈవో. ఈ అంశంపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

16. మహేశ్వర్‌ రావు – తెలంగాణ

ప్రశ్న: ఆన్‌లైన్‌ ఆర్జిత సేవల టికెట్ల వివరాలను ఎస్వీబీసీలో స్క్రోలింగ్‌ ఇవ్వండి?

ఈవో. ఎస్వీబీసీలో స్క్రోలింగ్‌ ఇస్తున్నాం. టిటిడి కాల్‌ సెంటర్లు, సమాచార కేంద్రాలలో కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

17. ప్రసాద్‌ – జంగారెడ్డిగూడెం

ప్రశ్న: తిరుమలలో ఏర్పాట్లు బావున్నాయి, ధ్వజస్తంభం వద్ద తోపులాటలు జరుగుతున్నాయి?

ఈవో. వెండివాకిలి వద్ద మార్పులు చేయడం వల్ల ప్రస్తుతం ఎలాంటి తోపులాటలు జరుగడం లేదు.

18. వత్సల – హైదరాబాద్‌

ప్రశ్న: శ్రీవారి దర్శన ఏర్పాట్లు చాలా బావున్నాయి. వృద్ధులు, దివ్యాంగులకు సహాయకులను అనుమతించగలరు?

ఈవో. సహాయలు లేకుండా దర్శనానికి వెళ్లలేని వారికి మాత్రమే అనుమతిస్తున్నాం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.