REVIEW MEETING HELD _ పత్రికా ప్రకటన తిరుమల, 2019 అక్టోబరు 02 అక్టోబరు 4న శ్రీవారి గరుడసేవకు విస్తృత ఏర్పాట్లు – టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
అక్టోబరు 4న శ్రీవారి గరుడసేవకు విస్తృత ఏర్పాట్లు – టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
తిరుమల, 2019 అక్టోబరు 02: శ్రీవారి గరుడసేవకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడిలోని వివిద విభాగాల అధికారులతో రోజువారీ సమీక్షా సమావేశం టిటిడి కంట్రోల్ రూమ్‌లో అదనపు ఈవో బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు.
తిరుమలకు విచ్చేసే భక్తులకు ప్రధానమైన వసతి, కల్యాణకట్ట, దర్శనం, అన్నప్రసాదాలు, పారిశుధ్యం, ఇతర సౌకర్యాల గురించి సంబంధిత విభాగాల వారిగా అధికారులతో సమీక్షించారు. అక్టోబర్ 4 న గరుడ సేవకు టిటిడిలోని అన్ని విభాగాలు కార్యాచరణ ప్రణాళికను తీసుకురావాలని, గురువారం జరుగు సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలిపారు.
అనంతరం ఐఎఎస్ ట్రైనీ అధికారులను వారు సందర్శించిన విభాగాలకు సంబంధించిన నివేదిక అందించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో టిటిడి సీనియర్ అధికారులు, ఐఎఎస్ ప్రొబేషనరీ అధికారులు అందరూ హాజరయ్యారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.