REVIEW MEETING HELD _ వేద విద్వ‌త్ ఆగ‌మ స‌ద‌స్సుకు మెరుగ్గా ఏర్పాట్లు చేప‌ట్టాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 29 Nov. 19: The Additional EO Sri AV Dharma Reddy on Friday reviewed on various developmental works under progress in Tirumala.

A review meeting was held at Annamaiah Bhavan with all the HoDs at Tirumala. The Additional EO instructed all the HoDs to submit a department wise compliance report by next review meeting on the replacement of plastic bottles with alternative measures in their respective offices.

Later Additional EO also directed the departments concerned to complete all the pending works within the stipulated time. He said, the concerned officials should come out with an action plan to make necessary arrangements for the 28th Veda Vidwat Agama Sadas which is set to take place from February 25 to March 1 in 2020.

CE Sri Ramachandra Reddy, FACAO Sri Balaji, DyEO Sri Harindranath, GM Sri Sesha Reddy, VGO Sri Manohar and others were also present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

వేద విద్వ‌త్ ఆగ‌మ స‌ద‌స్సుకు మెరుగ్గా ఏర్పాట్లు చేప‌ట్టాలి :  టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 29 నవంబర్‌ 2019: స‌నాత‌న ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 25 నుండి మార్చి 1వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో వేద విద్వ‌త్ ఆగ‌మ స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌కు చ‌క్క‌గా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని  టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వనంలో శుక్ర‌వారం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ జ‌న‌వ‌రి నుండి తిరుమ‌ల‌లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించే దిశ‌గా అడుగులు వేయాల‌న్నారు. ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లు వినియోగించ‌కుండా ఏర్పాటు చేసిన సౌక‌ర్యాల‌పై భ‌క్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ప్లాస్టిక్ నిషేధానికి ఇంకా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నే విష‌యంపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అదేవిధంగా, కాష‌న్ డిపాజిట్ తిరిగి ప్ర‌వేశ‌పెట్ట‌డం, తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను అద‌న‌పు ఈవో స‌మీక్షించారు.

ఈ స‌మావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.