GRAND CONCLUSION OF VASANTHOTSAVAM AT SRI KVST, SRINIVASA MANGAPURAM_ వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు

Tirupati, 7 May 2018: The three day glittering festival of Vasanthotsavam concluded on Monday at the Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram.

On Day 3, daily rituals of Suprabatham, Tomala Seva, Koluvu, Panchanga Sravanam and Sahasranamarchana seva were performed. Later in the morning Sri Kalyana Venkateswara Swamy along with utsava idols of Sri Sridevi and Sri Bhudevi, Sitarama Lakshmana, Anjaneya, Rukmini, Satyabhama Sri Krishna were brought to Vasanta mandapam for Asthanam.

In the afternoon the utsava idols were given Snapana Thirumanjanam with milk, honey, sandal paste, curd, coconut water and perfumed waters. In the Evening unjal seva was performed and paraded on the mada streets at night.

TTD local temples DyEO Sri Venkataiah, Temple Superintendent Sri Ramanaiah, officials and devotees participated in the event.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు

మే 07, తిరుపతి, 2018: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.

ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి, శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీక ష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.

మధ్యాహ్నం 1.45 నుండి 3.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పంచద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆలయం వెలుపల గల మండపంలో ఊంజల్‌ సేవ జరుగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ రమణయ్య ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.