అక్టోబరు 5 నుంచి 13వ తేదీ వరకు రిషికేష్‌లో అఖండనామ సంకీర్తన, పురుషోత్తమ యాగం

అక్టోబరు 5 నుంచి 13వ తేదీ వరకు రిషికేష్‌లో అఖండనామ సంకీర్తన, పురుషోత్తమ యాగం

అక్టోబరు 03, తిరుపతి, 2017: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రిషికేష్‌లో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబరు 5 నుంచి 13వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అఖండనామసంకీర్తన, అక్టోబరు 12, 13వ తేదీల్లో పురుషోత్తమ యాగం నిర్వహించనున్నారు.

విశ్వశాంతి కోసం, ప్రపంచ మానవాళికి మానసిక సంతోషాన్ని కలిగించేందుకు పవిత్రమైన గంగా నది తీరాన పురుషోత్తమ యాగం నిర్వహిస్తున్నట్టు దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీఆనందతీర్థాచార్యులు తెలిపారు. ఈ తొమ్మిది రోజుల అఖండనామ సంకీర్తన కార్యక్రమంలో ప్రతి రెండు రోజులకు 500 మంది చొప్పున భజన మండళ్ల సభ్యులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.