SAKSHATKARA VAIBHAVAMS IN SRINIVASA MANGAPURAM FROM JULY 16 TO 18 AND PARVETA UTSAVAM ON JULY 19_ జులై 16 నుండి 18వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవం

Tirupati, 29 June 2018: The annual ‘Sakshatkara Vaibhavam’ in the form of a three-day festival at Kalyana Venkateswara temple, Srinivasa Mangapuram, near Tirupathi will be celebrated between July 16th and 18.

Priests of Sri Kalyana Venkateswara Swamy perform Snapana Thirumanjanam (Celestial Bath) to the processional deities from 10 am to 11.30 am inside temple premises during these days. This festival is considered to be as important on par with the Annual Brahmotsavams.

As per historical evidences, the Sasanams engraved ‘on the right door-jamb wall of the entrance of Sri Kalyana Venkateswara Swamy Temple at Mangapuram village, dated 22nd March, 1510AD, the temple was brought to worship by doing “Jeernoddarana” by Chinna Thirumalacharyulu, the grand son of Saint Poet Thallapaka Annamcharyulu.

In 1940, an Archaka by name Sundararajan, from Kanchipuram of Tamil Nadu has came to the Village Mangapuram, saying that Lord Srinivasa has appeared in his dream and told to bring past glory to the temple, which was in dilapidated condition, by performing Dhoopa Deepa Naivedhya Aradhana and disappeared”.

Archaka Sundararajan then cleared all the debris in and around the Temple with the help of village elders and did the first pooja on 11th July 1940 ‘Ashada Suddha Sasti Day’, said to be the day or muhurtham as ordered by the Lord Himself in his dream.

To mark the auspicious day of revival of nitya pooja kainkaryams as decided by Lord Himself, TTD has been conducting this festival as ‘Sakshatkara Vaibhavam’ on Ashada Suddha Sasti Day in the month of June/July of every year.

On first day evening, the lord will take ride on Golden Tiruchi, second day on Hanumantha and final day on Garuda Vahanam. Meanwhile the Paruveta Utsavam will be observed on July 19 near Srivari Mettu.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జులై 16 నుండి 18వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవం

తిరుపతి, 2018 జూన్‌ 29: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరము ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి నిర్వహించే శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం జులై 16 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనుంది.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జులై 16, 17, 18వ తేదీలలో ఉదయం 9.00 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ జరుగుతుంది.

జూలై 16వ తేదీ సోమవారం రాత్రి 7.00 గంటల నుండి 8.00 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

జూలై 17వ తేదీ మంగళవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు.

జూలై 18వ తేదీ బుధవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

జులై 19న పార్వేట ఉత్సవం :

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జులై 19వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం, పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం :

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్‌ 12వ తేదీ గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు నిర్వహిస్తారు. ఉదయం 7.00 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 12.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

పలు ఆర్జిత సేవలు రద్దు :

ఈ సందర్భంగా జులై 12, 19వ తేదీలలో తిరుప్పావడసేవ, జులై 17న స్వర్ణపుష్పార్చన, జూలై 18న అష్టోత్తర శతకలశా భిషేకం సేవలను రద్దు చేశారు. అదేవిధంగా జూలై 12 మరియు జూలై 16 నుండి 19వ తేదీ వరకు ఆర్జిత కళ్యాణోత్సవం సేవలు రద్దు కానున్నాయి.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

చారిత్రక ప్రాశస్త్యం :

క్రీ.శ 14వ శతాబ్దం నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ప్రారంభమైనట్టు శాసనాధారాల ప్రకారం తెలుస్తోంది.

క్రీ.శ 1433వ సంవత్సరంలో చంద్రగిరిని పాలించిన విజయనగర రాజుల వంశానికి చెందిన రెండవ దేవరాయ తిరుమలలో క్రమపద్ధతిలో వేదపారాయణం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇది బహుళ ప్రజాదరణ పొందింది. ఈ విషయాన్ని ఆలయాధికారి తెలుసుకుని సిద్ధకోట్టై అని పిలవబడే శ్రీనివాసపురానికి(ఇప్పుడు శ్రీనివాసమంగాపురం) చెందిన 24 మంది మహాజనులను స్వామివారి ఆస్థానంలో వేదాలను పారాయణం చేసేందుకు నియమించారు. దీనికి ఆమోదం తెలిపిన రాజుగారు ఇందుకయ్యే ఖర్చు కోసం తన రాజ్య పరిధిలోని సిద్ధకోట్టై గ్రామం నుండి రాజ్య భాండాగారానికి వచ్చే సొమ్ములో అర్ధ భాగాన్ని మంజూరు చేశారు.

అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల మనవడైన శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులు శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడి ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి పూజలను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో క్రీ.శ 1540లో చంద్రగిరిని పాలించే అచ్యుతరాయలు మంగాపురం గ్రామాన్ని సర్వమాన్య అగ్రహారం(పన్నులేని భూమి)గా శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులకు అందజేశారు.

అనంతరం క్రీ.శ 1780లో ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని లూటీ చేశారు. ఆలయ ప్రధానరాజగోపురం, గర్భాలయ గోపురం, విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పాక్షికంగా ధ్వంసమైన కొన్ని విగ్రహాలు ప్రస్తుతం చంద్రగిరికోటలో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్నాయి. 1920వ సంవత్సరంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయ పురాతన కట్టడంగా గుర్తించి భారత ప్రభుత్వ పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చింది. అప్పటి నుండి ఈ ఆలయం భారత ప్రభుత్వ పురావస్తు శాఖ రక్షిత కట్టడాల జాబితాలో ఉంది.

అనంతరం 1940వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన మధ్వ బ్రాహ్మణుడు సుందరరాజ మంగాపురానికి వచ్చి శ్రీనివాసుడు తనకు కలలో కనిపించాడని తెలిపారు. ”శ్రీనివాసమంగాపురంలో ఉన్న నాకు ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. నా ఆలయానికి పూర్వ వైభవం కల్పించు” అని స్వామి ఆదేశించారని వివరించారు.

తరువాత గ్రామపెద్దలైన వెంకటకృష్ణయ్య, నరసింగాపురం రెడ్డివారి నాధమునిరెడ్డి, గుర్రప్ప ఆచారి మరియు తొండవాడ మొగిలి సుందరరామిరెడ్డి తదితరులను సుందరరాజ కలిసి స్వామివారు తనకు కలలో కనిపించిన విషయాన్ని వివరించి సాయం చేయాలని కోరారు. ఆ సమయంలో ఆలయం మొత్తం ముళ్లపొదలు, చీమలపుట్టలు, విషపు కీటకాలు, పాములతో నిండి గోపురాలు కూలిపోయే స్థితిలో ఉండేది. గ్రామపెద్దల సాయంతో సుందరరాజ ముళ్లపొదలు, చీమలపుట్టలను తొలగించి ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. స్వామివారు కలలో సూచించిన విధంగా 1940 జులై 11న ఆషాడ శుద్ధ షష్ఠి రోజున తొలిపూజ చేశారు.

అదేవిధంగా అర్చకుడైన సుందరరాజకు స్వామివారు కలలో కనిపించి చెప్పిన విధంగా తితిదే అప్పటినుండి నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తోంది. అలాగే మొదటి పూజను నిర్వహించిన ఆషాడ శుద్ధ షష్ఠి రోజున ”సాక్షాత్కార వైభవం” పేరిట టిటిడి ప్రతి ఏడాదీ ఉత్సవం నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి టిటిడి నిర్వహిస్తుండడం విశేషం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.