SARASWATI YAGAM AT SV VEDIC UNIVERSITY_ జనవరి 28న ఎస్వీ వేద వర్సిటీలో శ్రీ సరస్వతీయాగం

Tirupati, 25 January 2018: On the occasion of Bhishma Ekadasi on Jan 28, TTD will perform Saraswati Yagam at te Sri Maha Vishnu yagasala of Sri SV Veda university.

The holy ritual is aimed at blessings of Goddess Saraswati for betted performance of students in the academic year of 2018 in order to give them better memory and knowledge. All students of Tirupati are used to participate and procure the Saraswati Kanakanam and chant Saraswati mantra for success.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 28న ఎస్వీ వేద వర్సిటీలో శ్రీ సరస్వతీయాగం

తిరుపతి, 2018 జనవరి 25: టిటిడి, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీన భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ సరస్వతీయాగం నిర్వహించనున్నారు. వర్సిటీ ప్రాంగణంలోని శ్రీమహావిష్ణుయాగశాలలో ఈ యాగం చేపడతారు.

2018వ విద్యాసంవత్సరంలో పరీక్షలు రాయబోవు విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, జ్ఞానసమృద్ధి, విజ్ఞాన వికాసం, ఉన్నతస్థితి సాధనతోపాటు అందరికీ సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఈ యాగం నిర్వహించనున్నారు. కావున తిరుపతిలోని విద్యార్థులందరూ ఈ యాగంలో పాల్గొని సరస్వతీ కంకణం ధరించి, సరస్వతీ మంత్రం జపించాలని వర్సిటీ అధికారులు కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.