SEER OF SRI SHAKTI PEETHAM PRESENTS GIR BREED COW AND A CALF TO TTD _ టీటీడీ కి గిర్ గోవు దూడను బహూకరించిన వేలూరు శ్రీ శక్తి పీఠాధిపతి శ్రీశ్రీనారాయణి అమ్మ
TTD CHAIRMAN VISITS VELLORE GOLDEN TEMPLE
TIRUPATI, 18 SEPTEMBER 2021: The Pontiff of Sri Shakti Peetham in Vellore of Tamilnadu, HH Sri Narayani Amma has presented a Cow and calf belonging to Gir breed to TTD on Saturday.
Earlier, TTD Chairman Sri YV Subba Reddy along with his wife Smt Swarnalatha took part in the Abhishekam of Sri Mahalakshmi Ammavaru and the temple authorities presented them prasadams.
Later they visited Sri Narayani Amma and took his blessings. The Pontiff appreciated the efforts of TTD for safeguarding and promoting Desi cows with programmes like “Gudiko Gomata”, “Govinduniki Goadharita Naivedyam”, etc. Thereafter, he presented the TTD Chairman a cow and calf.
The Vellore legislator and the TTD Board member Sri Nanda Kumar was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ కి గిర్ గోవు దూడను బహూకరించిన వేలూరు శ్రీ శక్తి పీఠాధిపతి శ్రీశ్రీనారాయణి అమ్మ
— బంగారు గుడిని దర్శించిన టీటీడీ చైర్మన్ దంపతులు
తిరుపతి 18 సెప్టెంబరు 2021: తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో గల బంగారు గుడిని శనివారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు దర్శించారు. ఈ సందర్భంగా శక్తి పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ నారాయణి అమ్మ టీటీడీ కి గి ర్ ఆవు, దూడను బహూకరించారు.
బంగారు ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ అధికారులు సంప్రదాయంగా స్వాగతం పలికారు.
ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. తరువాత బంగారు మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేసి హారతి ఇచ్చారు. అనంతరం
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు చైర్మన్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
అనంతరం చైర్మన్ దంపతులు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ నారాయణి అమ్మను కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ టీటీడీ నిర్వహిస్తున్న గోసేవ,నవనీత సేవ, గుడికో గోమాత కార్యక్రమాలను శ్రీ నారాయణి అమ్మకు వివరించారు. టీటీడీ చేస్తున్న గోసేవను
శ్రీ నారాయణి అమ్మ ప్రశంసించారు. అనంతరం చైర్మన్ కు గోవు, దూడ ను అందజేశారు. వేలూరు శాసన సభ్యుడు, టీటీడీ పాలకమండలి సభ్యులు
శ్రీ నంద కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది