SIMHA VAHANA SEVA AT VONTIMITTA _ సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం
VONTIMITTA, 19 APRIL 2024: The ongoing annual Brahmotsavam at Sri Kodanda Ramalayam in Vontimitta witnessed Sri Rama taking a celestial ride on Simha Vahanam on Friday evening.
The deity paraded along the streets blessing devotees.
DyEO Sri Natesh Babu and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం
తిరుపతి, 2024 ఏప్రిల్ 19: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
రాత్రి 7 గంటల నుండి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి(వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, శ్రీ టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.