SIMHA VAHANAM HELD _ సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప

Tirupati, September 29 2022: On day 3 of the ongoing annual Brahmotsavams Sri Malayappa took out a celestial ride on Simha vahanam in Yoga Narasimha alankaram and blessed the devotees along the sacred Mada streets.

The impressive procession of Sri Malayappa was led by majestic elephant, horses, bulls and paraphernalia accompanied by bhajan teams, kolata and traditional drums etc. as devotees offered karpoora Harati at the each turn of Mada streets.

Simha, the lion is a symbol of strength, dignity and leadership which reflected in today’s vahana Seva of Sri Malayappa Swamy. The incarnation of Lord Vishnu as the Mrugendrudu (most ferocious and strong among the animals, Lion) is an indication of Lord as a powerful avatar to punish the wrong doers in the universe and protection of the righteous, poor and the weaker sections in the society.

In the Yoga Shastra – a Lion was seen as an embodiment of power and speed.

The statues of Lions in the Ananda Nilayam, in the Srivari temple complex have also indicated the power of Lion King. The sub temple of Narasimha in Yogamudra in the temple and also the idol of Lakshmi Narasimha on the way to Tirumala in Alipiri footpath route exhibits the significance of Lion (Simha) in the celestial entourage of Lord Venkateswara.

Both the Pontiffs of Tirumala, TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, TTD Board members and other senior officers of TTD were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 29: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారు యోగ న‌ర‌సింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సింహ వాహనం – ధైర్య‌సిద్ధి

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.