SIXTH CONVOCATION OF SV VEDIC UNIVERSITY ON OCTOBER 28 _ అక్టోబర్ 28న ఎస్వీ వేద విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం

SIXTH CONVOCATION OF SV VEDIC UNIVERSITY ON OCTOBER 28

Tirupati, 27 October 2021: The Sixth Convocation of Sri Venkateswara Vedic University for the year 2019-20 batch of students will be held on October 28 at 11.30 am in the Yagashala of the University.

The Chancellor of the University and Honourable Governor of Andhra Pradesh His Excellency Sri Biswabusan Harichandan will virtually preside over the session. The Vice-Chancellor of the University Acharya Sannidhanam Sudarshan Sharma will present the annual report of the University and also the keynote address of the convocation.

The University was established by TTD and recognized by UGC imparted courses in Vedanga, Veda Bhashya, Agama, and Paurohityam. At the convocation 122 graduates, 46 Masters, 2 M.Phil, and 11 Ph.D. achievers shall be presented their certificates.

The highlight of the convocation is the presentation of the Maha Mahopodhyaya award to the retired Sama Veda Pundit  Brahmarashi Sri Ganesan Shruti of TTD.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబర్ 28న ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం 6వ స్నాత‌కోత్స‌వం

తిరుపతి, 2021 అక్టోబర్ 27 ; తిరుపతిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం 6వ స్నాత‌కోత్స‌వం అక్టోబర్ 28వ తేదీన జ‌రుగ‌నుంది. రాష్ట్ర గ‌వ‌ర్న‌రు శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ( వర్చువల్ ) అధ్య‌క్ష‌త‌న ఈ కార్య‌క్ర‌మం జరుగనుంది.

గురువారం ఉదయం 11.30 గంట‌ల‌కు వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోని యాగ‌శాల‌లో స్నాత‌కోత్స‌వం నిర్వ‌హిస్తారు. ఇందులో 2019-20 ఉత్తీర్ణులైన 122 మందికి బ్యాచిల‌ర్స్ డిగ్రీ, 46 మందికి మాస్ట‌ర్ డిగ్రీ, ఇద్ద‌రికి ఎంఫిల్‌, 11 మందికి పిహెచ్‌డి ప‌ట్టాలు ప్ర‌దానం చేస్తారు. అదేవిధంగా, తిరుప‌తికి చెందిన వేద‌పండితుడు బ్ర‌హ్మ‌శ్రీ
గణేశన్ శ్రౌతి కి మ‌హామ‌హోపాధ్యాయ పుర‌స్కారం అంద‌జేస్తారు.

ఎస్వీ వేద వ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌నశ‌ర్మ స్వాగతోపన్యాసం చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.