SNAPANAM HELD _ వైభ‌వంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి స్న‌ప‌న తిరుమంజ‌నం

TIRUMALA, 17 APRIL 2024: The Snapana Tirumanjanam to the deities of Sri Sita Lakshmana Anjaneya sameta Sri Ramachandra Murty were rendered on Wednesday at Ranganayakula Mandapam in Tirumala temple in connection with Sri Rama Navami festival.

The special Abhishekam was telecast live on SVBC between 9am and 11am for the sake of global devotees.

Tirumala Pontiff Sri Pedda Jeeyar Swamy, EO Sri AV Dharma Reddy, DyEO Sri Bhaskar and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

వైభ‌వంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి స్న‌ప‌న తిరుమంజ‌నం

తిరుమల, 2024 ఏప్రిల్ 17: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ మరియు అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, ఈవో శ్రీ ఏవి ధర్మా రెడ్డి దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.