SODASADINA BALAKANDA TO CONCLUDE ON SEPTEMBER 18 _ సెప్టెంబ‌రు 18న ముగియ‌నున్న‌ “షోడ‌శ‌దిన బాల‌కాండ పారాయ‌ణ‌ దీక్ష”

SITA RAMA KALYANAM TO BE SPECIAL ATTRACTION

 

TIRUMALA, 16 SEPTEMBER 2021: The 16-day Sodasadina Balakanda Parayanam will conclude on September 18 at Vasantha Mandapam in Tirumala.

 

Seeking the divine intervention from Covid Pandemic TTD has been conducting Balakanda Parayanam especially focussing the children which commenced on September 3.

 

A total of 2232 shlokas from 77 sargas shall be recited in these 16 days. Everyday TTD has been telecasting the live Parayanam on SVBC between 8:30am and 10am for the sake of global devotees.

 

On the last day on September 18, Sri Sita Rama Alankara Sangeetha Kalyanam will be performed between 7pm and 8:30pm.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 18న ముగియ‌నున్న‌ “షోడ‌శ‌దిన బాల‌కాండ పారాయ‌ణ‌ దీక్ష”

చివ‌రి రోజున శ్రీ సీతారామ అలంకార క‌ల్యాణం

తిరుమల, 2021 సెప్టెంబరు 16: లోక సంక్షేమం కోసం, చిన్నారులు అందరూ ఆరోగ్యంగా ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ వ‌సంత మండ‌పంలో జ‌రుగుతున్న షోడ‌శ‌దిన బాల‌కాండ పారాయ‌ణ దీక్ష సెప్టెంబ‌రు 18వ తేదీన శ‌నివారం ముగియ‌నుంది. చివ‌రిరోజు శ్రీ సీతారామ అలంకార సంగీత కల్యాణం నిర్వ‌హిస్తారు.

బాల‌కాండ‌లో ” బ‌భౌరామఃసంప్ర‌హృష్టఃస‌ర్వ‌దైవ‌తైః ” అనే 16 అక్ష‌రాల వాక్యం విశిష్ట‌మైన‌ది. ఇందులోని బీజాక్ష‌రాల ప్ర‌కారం బాల‌కాండ‌లోని మొత్తం 77 స‌ర్గ‌ల్లో గ‌ల 2,232 శ్లోకాలను పారాయ‌ణం చేస్తున్నారు. వ‌సంత మండ‌పంలో 16 మంది పండితులు శ్లోక పారాయ‌ణం చేస్తుండ‌గా ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు శ్రీ‌ సీతా ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామి స‌మేత శ్రీ రామ‌చంద్ర‌మూర్తి మూల మంత్ర జ‌ప‌-త‌ర్ప‌ణ‌- హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నారు. కాగా, చివ‌రిరోజు రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారామ అలంకార సంగీత కల్యాణం నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.