SPECIAL ACTION PLAN FOR CAALAMITY RESPONSE AT TIRUMALA- TTD EO _ తిరుమలలో విపత్తుల నివారణకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక
- SPECIAL NDMA WORKSHOP SOON
Tirumala, 15,2022: TTD EO Sri AV Dharma Reddy urged the National Disaster Management Authority (NDMA) officials to conceive a special action plan for averting natural calamities in Tirumala.
He was addressing during his participation in a virtual meeting held with NDMA joint secretary Sri Kumal Sathyarthi from Annamaiah Bhavan in Tirumala on Thursday.
Speaking on the occasion the EO said TTD had evolved safeguards and a strong security system to protect devotees during rush hours. However the TTD was looking at NDMA to develop action plans to protect devotees during calamities like land slides, road accidents and also stampedes if any.
He said TTD has been daily attracting over 80,000 footfalls and lakhs during festivals and special occasions. Tirumala also accommodates 7500 rooms and many shops in the shopping complex. An action plan is needed to evacuate people if any fire accidents triggered by electrical short circuits or accidental mishaps, he said.
Among others rescue and rehabilitation plans are needed to tackle accidents at locations viz. Srivari laddu and Annaprasadam preparing areas, land slides affecting Ghat road traffics, Forest fires and hot winds, in Seshachala forests.
TTD EO sought the NDMA to organise drafting a manual of Standard Operating Procedures (SOP) for benefit of TTD.
Responding to the request of EO, the NDMA Joint Secretary said a team of experts in National Disaster Management would be sent to Tirumala soon. The experts team after studying the situation will conduct a workshop on the theme and also train the TTD staff in tackling the calamities at Tirumala.
TTD JEO Smt Sada Bhargavi, Sri Veerabrahmam (virtual), CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, Tirumala Additional SP Sri Muniramaiah, AP NDMA officials Sri Nagaraj, Sri Sekhar Chaturvedi, Tirupati DRO Sri Srinivasa Rao, TUDA Secretary Smt Lakshmi, Regional Meteorological Officer Sri Balachandra, IIT expert Sri Srikrishna and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో విపత్తుల నివారణకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక
– త్వరలో ఎన్‌డిఎంఏ కమిటీ ఆధ్వర్యంలో వర్క్‌షాప్
– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2022 సెప్టెంబరు 15: తిరుమలలో విపత్తుల నివారణకు ఒక ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కోరారు.
తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం తిరుపతి జిల్లా, టీటీడీకి సంబంధించిన విపత్తుల నివారణ అనే అంశంపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో న్యూఢిల్లీకి చెందిన ఎన్‌డిఎంఏ జాయింట్ సెక్రెటరీ శ్రీ కునాల్ సత్యర్థి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఈవో మాట్లాడుతూ, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు ప్రతి రోజు 80 వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో లక్షలమంది భక్తులు వస్తుంటారని తెలిపారు. యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి పటిష్టమైన భద్రతా వ్యవస్థను కలిగి ఉన్నామన్నారు. కానీ తొక్కిసలాట, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అధిక నష్టాన్ని నివారించడానికి, ప్రకృతి నుండి ఎదురయ్యే సవాళ్లను సాధ్యమైనంత వరకు ఎదుర్కోవడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. తిరుమలలో 7,500 వసతి గదులు, అనేక వాణిజ్య సముదాయాలు ఉన్నాయని ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను రూపొందించాలన్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి గ్యాస్ వినియోగించే చోట ప్రమాదాలను అరికట్టేందుకు చేపట్టవలసిన చర్యలు తెలపాలన్నారు. అకస్మాత్తుగా సంభవించే భారీ వర్షాలు, పిడుగుల వలన కొండ చరియలు విరిగిపడటం ద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నదన్నారు. వేసవి కాలంలో శేషాచల అడవులలో సంభవించే అగ్ని ప్రమాదాలు, వడగాలుల గురించి ఆయన వివరించారు. ఇందుకు సంబంధించిన ఇబ్బందులను అధిగమించడానికి ఎన్‌డిఎంఏ ఆధ్వర్యంలో ఎస్ఓపి (స్టాండర్డ్ అప్‌రేటింగ్ సిస్టమ్) ను ఏర్పాటు చేయాలని ఈవో కోరారు.
ఇందుకు స్పందించిన ఎస్‌డిఎంఏ జాయింట్ సెక్రెటరీ టీటీడీకి సంబంధించిన అంశలపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రంగంలో నిపుణులైన వారితో ఒక కమిటీ ఏర్పాటు చేసి తిరుమలకు పంపుతామన్నారు. దీనిపై ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం (వర్చువల్ ), సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, తిరుమల అదనపు ఎస్‌పి శ్రీ మునిరామయ్య, ఎపిఎస్ డిఎంఏ అధికారులు శ్రీ నాగరాజు, శ్రీ శేఖర్ చతుర్వేది, తిరుపతి డిఆర్‌వో శ్రీ శ్రీనివాసరావు, తుడా సెక్రటరి శ్రీమతి లక్ష్మి, ప్రాంతియ వాతావరణ అధికారి శ్రీ బాలచంద్ర, ఐఐటి నిపుణులు శ్రీ శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.