FESTIVE EVENTS AT SRI GT IN THE MONTH OF MARCH_ మార్చిలో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 28 February 2018: Following are the details of the several special festivals scheduled in the Sri Govindaraja Swamy Temple during March, 2018. They are

• March 1: Garuda Vahanam on Pournami
• March 2,9,16: Fridays Sri Andal Ammavaru procession on Mada streets
• March 3:Uttara nakshatram, Procession of Sri Govindaraja Swamy with consorts on mada streets.
• March 13: Koil Alwar Tirumanjanam
• March 14: Shravana nakshatram Procession of Sri Kalyana Venkateswara with consorts Sri Devi and Sri Bhudevi on mada streets.
• March 18: Asthanam for Sri Govindaraja Swamy with consorts Sri Devi and Bhudevi at evening.
• March 23: Rohini nakshatram, Sri Parthasarathi with Sri Rukmini procession on mada streets.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చిలో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2018 ఫిబ్రవరి 28: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– మార్చి 1న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తారు.

– మార్చి 2, 9, 16వ తేదీల్లో శుక్రవారం నాడు ఆలయ మాడవీధుల్లో శ్రీ ఆండాళ్‌ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

– మార్చి 3న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

– మార్చి 13న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

– మార్చి 14న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

– మార్చి 18న ఉగాది రోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారికి సాయంత్రం 5.30 నుంచి 7.00 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు.

– మార్చి 23న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.