SRI GT PAVITROTSAVAMS REACH SECOND DAY_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పవిత్ర సమర్పణ

Tirupati, 2 September 2017: The three day annual brahmotsavams of Sri Govindaraja Swamy temple reached second day on Saturday.

As a part of it snapana tirumanjanam was observed to the deities. Later Pavitamalas were decorated to the deities and pavitra samarpana was observed as per agama.

Temple DyEO Smt Varalakshmi, AEO Sri Prasad Raju, Temple Suptd Sri Suresh and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పవిత్ర సమర్పణ

సెప్టెంబరు 02, తిరుపతి, 2017: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం పవిత్ర సమర్పణ ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఆ తరువాత మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. అనంతరం సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. ఆదివారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. గ హస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. ఒక పవిత్రం ప్రసాదంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ప్రసాదమూర్తిరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.