SRI KALABHAIRAVASWAMY HOMAM AT SRI KAPILESWARASWAMY TEMPLE_ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవస్వామివారి హోమం

Tirupati, 17 November 2017: As part of the ongoing Homa Mahotsavam, Sri Kalabhairava Homam was performed at the Sri Kapileswaralaya temple in the temple town.

As part of the celestial event Astha Bhairava Homam, Maha Purnahuti, Kalasa Udwasana, Maha Shanti Abhisekham, Kalasabhisekam, Nivedana and Harati were performed at the Yagashala of the Sri Kapileswaralaya in the morning.

On Nov.18th Saturday, Sri Chandikeswara Swami homam will be conducted and interested couple were advised to participate with a payment of Rs.500 per couple and beget Uttariyam, Blouse piece and Anna prasadams.

TTD local temple DyEO Sri Subramanyam, AEO Sri Sankara Raju, Temple priest Sri Maniswamy, Sri Swaminath Swamy, Sri Vijay swami and other officials and devotees participated.


ISSUED BY TTDs,PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవస్వామివారి హోమం

నవంబరు 17, తిరుపతి, 2017 ; తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీచండికేశ్వరస్వామివారి కలశస్థాపన, హోమం, విశేష దీపారాధన నిర్వహిస్తారు.

నవంబరు 18వ తేదీ శనివారం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీశంకర్‌రాజు, ఆలయ అర్చకులు శ్రీ మణిస్వామి, శ్రీ స్వామినాథస్వామి, శ్రీ విజయ స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.