VASANTHOTSAVAM IN SKVST_ మే 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

Tirupati, 3 May 2018: The three day annual Vasanthotsavams will be observed in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram from May 5 to 7.

Every day there will be Snapana Tirumanjanam between 2pm and 4pm. While on second day on May 6, the procession of Swarnaratham takes place between 6pm and 7pm.

On the last day along with Sridevi and Bhudevi sametha Sri Kalyana Venkateswara Swamy, Snapana Tirumanjanam is also performed to Sri Sita Lakshmana, Anjaneya sametha Sri Ramachandra Murthy, Rukmini Satyabhama sametha Sri Krishna Swamy.

Grihastas can take part in this religious fete on the payment of Rs.516 per ticket. On each ticket two persons are allowed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

మే 03, తిరుపతి, 2018: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 5 నుండి 7వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు అంటే మే 5, 6వ తేదీల్లో శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్‌ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీసత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం.

కాగా రెండో రోజు మే 6వ తేదీ సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం ఊంజలసేవ, ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత సేవ అయిన కల్యాణోత్సవాన్ని రద్దు చేశారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.