POURNAMI GARUDA SEVA IN SKVST ON NOV 4_ నవంబరు 4న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పౌర్ణమి గరుడసేవ
Tirupati, 2 November 2017: With November 4 being auspicious Kartika Pourmami, Garuda Seva will be observed in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram apart from Tirumala temple.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
నవంబరు 4న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పౌర్ణమి గరుడసేవ
తిరుపతి, 2017 నవంబరు 02: శ్రీనివాసమంగపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 4వ తేదీ శనివారం పౌర్ణమి సందర్భంగా శ్రీవారి గరుడసేవ వైభవంగా జరగనుంది.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5.00 గంటలకు స్వామివారిని సుప్రభాతంలో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది