ASTOTTARA SATAKALASABHHISHEKAM IN SRI KRT ON NOV 4_ నవంబరు 4న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం

Tirupati, 2 November 2017: With November 4 being auspicious Kartika Pourmami, Garuda Seva will be observed in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram apart from Tirumala temple.

Meanwhile the monthly Astottara Sata Kalasabhishekam will be observed in Kodanda Rama Swamy temple on November 4 in Tirupati.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నవంబరు 4న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుపతి, 2017 నవంబరు 02: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో నవంబరు 4వ తేదీ శనివారం పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది