SRI PAT BTUs IN EKANTAM-JEO _ ఏకాంతంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు – టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ‌

TIRUPATI, 16 NOVEMBER 2021: The annual Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor will be observed in Ekantam owing to Covid restrictions, said TTD JEO Sri Veerabrahmam.

During the review meeting held at Asthana Mandapam at Tiruchanoor on Tuesday, the JEO said keeping in view the health safety of devotees, it has been to observe the mega religious fete and all Vahana Sevas in Ekantam from November 30 till December 9.

He directed the officials concerned to prepare for the same as in the case of last year observing all Covid norms of Social distancing, wearing masks and using sanitisers. He instructed the electrical and garden wings to make arrangements to match the occasion in a splendid manner. He also instructed the Annaprasadam wing to make necessary food arrangements for the deputation officers and directed the Health wing to take utmost care keeping the premises clean and hygienic in view of pandemic as well the inclement weather conditions.

Later speaking to media persons he said, all the arrangements for the big event are in place. “As a prelude, Laksha Kumkumarchana will be performed on November 29 followed by Ankurarpanam on the same day evening. The important days includes Dhwajarohanam on November 30, Gaja Vahanam on December 4, Garuda Vahanam on December 5, Panchami Theertham on December 8 and Dhwajarohanam on the same day evening. While Pushpa Yagam will be observed on December 9”, he added.

Temple DyEO Smt Kasturi Bai, Agama Advisor Sri Srinivasacharyulu, Archaka Sri Babu Swamy, SEs Sri Satyanarayana, Sri Venkateswarulu, GM Transport Sri Sesha Reddy, Additional HO Dr Sunil, AEO Sri Prabhakar Reddy, DSPs Sri Muralikrishna, Sri Katamaraju were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏకాంతంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు – టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ‌

తిరుప‌తి, 2021 న‌వంబ‌రు 16: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 30 నుంచి డిసెంబ‌రు 8వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం తెలిపారు.

తిరుచానూరులోని ఆస్థాన మండ‌పంలో మంగ‌ళ‌వారం జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ‌బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త దృష్ఠ్యా అమ్మ‌వారి వాహ‌న సేవ‌లు, పంచ‌మి తీర్థం ఆల‌య వాహ‌న మండ‌పంలో ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ కోవిడ్ -19ను దృష్టిలో ఉంచుకుని అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఆగ‌మ శాస్త్రం, సంప్ర‌దాయ బ‌ద్ధంగా ఏకాంతంగా నిర్వ‌హించేందుకు అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. ఉద్యాన‌, విద్యుత్ విభాగాల అధికారులు ఆల‌యం అలంక‌ర‌ణ‌లో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబిసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌‌న్నారు.

అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో స్న‌ప‌స తిరుమంజ‌నం నిర్వ‌హించే రోజుల్లో ఆక‌ర్ష‌ణీయ‌మైన మాల‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని ఉద్యానవ‌న విభాగం అధికారుల‌ను ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా విచ్చేసే భ‌క్తులంద‌రికి మూల‌మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌న్నారు. అన్న‌ప్ర‌సాదం విభాగం ఆధ్వ‌ర్యంలో డెప్యూటేష‌న్ సిబ్బందికి అన్న‌ప్ర‌సాదాలు అందిచాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా న‌వంబరు 29వ తేదీ ఉద‌యం ల‌క్ష‌కుంకుమార్చ‌న, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తార‌న్నారు. న‌వంబ‌రు 30న ఉద‌యం ధ్వజారోహణం, డిసెంబ‌రు 4న రాత్రి గ‌జ‌వాహ‌నం, డిసెంబ‌రు 8న పంచ‌మితీర్థం, డిసెంబ‌రు 9న పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, ఎస్ఇలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, డిఎస్పీలు శ్రీ‌ముర‌ళికృష్ణ‌, శ్రీ కాటంరాజు,
విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ర‌వాణా విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, ఉద్యాన విభాగం ఏడి శ్రీ శ్రీ‌నివాసులు, అద‌న‌పు ఆరోగ్య విభాగం అధికారి డా.సునీల్‌, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, పోలీస్‌, పంచాయ‌తి అధికారుల‌తో పాటు వివిధ‌ విభాగాల‌ అధికారులు స‌మీక్ష‌లో పాల్గొన్నారు.
—————————————————————-
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 30 నుంచి డిసెంబ‌రు 8వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం తెలిపారు.

తిరుచానూరులోని ఆస్థాన మండ‌పంలో మంగ‌ళ‌వారం జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ‌బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త దృష్ఠ్యా అమ్మ‌వారి వాహ‌న సేవ‌లు, పంచ‌మి తీర్థం ఆల‌య వాహ‌న మండ‌పంలో ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ కోవిడ్ -19ను దృష్టిలో ఉంచుకుని అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఆగ‌మ శాస్త్రం, సంప్ర‌దాయ బ‌ద్ధంగా ఏకాంతంగా నిర్వ‌హించేందుకు అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. ఉద్యాన‌, విద్యుత్ విభాగాల అధికారులు ఆల‌యం అలంక‌ర‌ణ‌లో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబిసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌‌న్నారు.

అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో స్న‌ప‌స తిరుమంజ‌నం నిర్వ‌హించే రోజుల్లో ఆక‌ర్ష‌ణీయ‌మైన మాల‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని ఉద్యానవ‌న విభాగం అధికారుల‌ను ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా విచ్చేసే భ‌క్తులంద‌రికి మూల‌మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌న్నారు. అన్న‌ప్ర‌సాదం విభాగం ఆధ్వ‌ర్యంలో డెప్యూటేష‌న్ సిబ్బందికి అన్న‌ప్ర‌సాదాలు అందిచాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా న‌వంబరు 29వ తేదీ ఉద‌యం ల‌క్ష‌కుంకుమార్చ‌న, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తార‌న్నారు. న‌వంబ‌రు 30న ఉద‌యం ధ్వజారోహణం, డిసెంబ‌రు 4న రాత్రి గ‌జ‌వాహ‌నం, డిసెంబ‌రు 8న పంచ‌మితీర్థం, డిసెంబ‌రు 9న పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, ఎస్ఇలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, డిఎస్పీలు శ్రీ‌ముర‌ళికృష్ణ‌, శ్రీ కాటంరాజు, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ర‌వాణా విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, ఉద్యాన విభాగం ఏడి శ్రీ శ్రీ‌నివాసులు, అద‌న‌పు ఆరోగ్య విభాగం అధికారి డా.సునీల్‌, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, పోలీస్‌, పంచాయ‌తి అధికారుల‌తో పాటు వివిధ‌ విభాగాల‌ అధికారులు స‌మీక్ష‌లో పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.